News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Realme Offer: ఈ రియల్‌మీ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.9,000 తగ్గింపు - కొనాలనుకుంటే ఇదే రైట్ టైం!

రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్ ఫోన్‌పై మనదేశంలో భారీ ఆఫర్ అందించారు. ఈ ఫోన్ ఇప్పుడు రూ.22,999కే కొనుగోలు చేయవచ్చు.

FOLLOW US: 
Share:

Realme GT Neo 2 Price Drop: రియల్‌మీ గతేడాది మనదేశంలో జీటీ నియో 2 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ను అందించారు. రూ.31,999 విలువైన ఈ ఫోన్‌ను రూ.22,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 5జీని కూడా సపోర్ట్ చేస్తుంది.

రియల్‌మీ జీటీ నియో 2 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర ఇప్పటికీ రూ.31,999గానే చూపిస్తుంది. కానీ ఈ ఆఫర్‌ను అందుకోవచ్చు. ఎలాగంటే దానికి మీరు ప్రీపెయిడ్ పద్ధతిని ఎంచుకోవాలి. అంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా... నగదు ముందే చెల్లించాల్లన్న మాట. అప్పుడు రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. తర్వాత చెల్లింపును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా పూర్తి చేస్తే మరో రూ.3,000 తగ్గింపు లభించనుంది.

రియల్‌మీ జీటీ నియో 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ జీటీ నియో 2 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 600 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ను కూడా రియల్ మీ జీటీ నియో 2 సపోర్ట్ చేయనుంది.

12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందించారు. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ (డీఆర్ఈ) ద్వారా 7 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 19 జీబీ వరకు ర్యామ్ ఉండనుందన్న మాట. 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 2 పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో కంపెనీ అందించిం. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 65w ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. పూర్తిగా చార్జ్ కావడానికి కేవలం 36 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది. 

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

Published at : 23 Feb 2022 08:31 PM (IST) Tags: Realme Offer Realme GT Neo 2 Realme GT Neo 2 Price in India Realme GT Neo 2 Offer Realme GT Neo 2 Bank Offer

ఇవి కూడా చూడండి

Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!

Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?