Realme 8i, 8s Launch Date: వచ్చే వారంలో రియల్‌మీ 8 సిరీస్ కొత్త ఫోన్ల లాంచ్.. స్పెసిఫికేషన్లు ఇవే!
రియల్‌మీ 8 సిరీస్ నుంచి.. 8ఐ, 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నెల 9న వీటిని భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్ సేథ్ తెలిపారు.
రియల్‌మీ 8 సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్‌లోకి లాంచ్ కానున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ల గురించి వస్తోన్న ఊహాగానాలకు కంపెనీ సీఈఓ మాధవ్ సేథ్ తెరదించారు. రియల్‌మీ 8 సిరీస్ నుంచి రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ (Realme 8s) 5జీ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రెండు ఫోన్లను ఈ నెల 9న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సిరీస్‍లో రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో, రియల్‌మీ 8 5జీ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉండగా.. వీటికి మరో రెండు జతచేరాయి.
The #realme8i truly stands out from the rest!
— realme (@realmeIndia) September 2, 2021
It's the only Smartphone in the segment that offers a 120Hz Ultra Smooth Display to let our #realmeFans experience nothing but the best.
Launching at 12:30 PM on 9th September on our official channels. https://t.co/VvE4HiPNde pic.twitter.com/ipPgc2rwVc
రియల్‌మీ 8ఐ స్పెసిఫికేషన్లు (అంచనా)
రియల్‌మీ 8ఐ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో పనిచేయనుందని మీడియాటెక్, రియల్‌మీ సంస్థలు ధ్రువీకరించాయి. దీనిలో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉండనుంది. దీనిలో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అందించారు. 4 జీబీ ర్యామ్, 128 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ 8ఐ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో రానుంది.
రియల్‌మీ 8ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
రియల్‌మీ 8ఎస్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేయనుందని కంపెనీ తెలిపింది. దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అందించారు. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది రానుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించినట్లు తెలుస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో పాటు 33 వాట్స్ డార్ట్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండనుంది.
Also Read: Galaxy M32 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం32జీ 5జీ సేల్ స్టార్ట్ అయింది.. ప్రారంభ ఆఫర్ల కింద తక్కువ రేటుకే..
Also Read: SmartPhones in September: సెప్టెంబరులో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..