PUBG New State: కొత్త పబ్జీ గేమ్ వచ్చేసింది.. అదిరిపోయే గ్రాఫిక్స్.. స్పెషల్ రివార్డ్స్ కూడా!
పబ్జీ: న్యూస్టేట్ గేమ్ భారత్ సహా 200కు పైగా దేశాల్లో లాంచ్ అయింది. ఇందులో మెరుగైన్ గేమ్ ప్లేతో పాటు మంచి రివార్డులు కూడా అందించారు.
పబ్జీ న్యూస్టేట్ గేమ్ అధికారికంగా లాంచ్ అయింది. భారతదేశం సహా 200కు పైగా దేశాల్లో ఈ గేమ్ ఒకేసారి లాంచ్ అయింది. ఈ కొత్త బ్యాటిల్ రాయల్ గేమ్‌ను ఫిబ్రవరిలోనే ప్రకటించారు. పబ్జీ ఫ్రాంచైజీలో ఈ గేమ్ లాంచ్ అయింది. ఈ గేమ్ కొత్త తరహా బ్యాటిల్ రాయల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుందని కంపెనీ ప్రకటించింది. 100 మంది ఆటగాళ్లు వేర్వేరు ఆయుధాలు, వ్యూహాలతో ఈ గేమ్ ఆడవచ్చని కంపెనీ తెలిపింది. 2051 సంవత్సరంలో ఒక కొత్త ప్రపంచం బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ గేమ్ లాంచ్ అయింది. ఇందులో కొత్త వాహనాలు, కన్స్యూమబుల్స్ కూడా ఉండనున్నాయి.
ఆండ్రాయిడ్, ఐవోఎస్, ఐప్యాడ్ఓఎస్ డివైస్‌ల్లో ఈ గేమ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 6.0, ఐవోఎస్ 13, ఐప్యాడ్ఓఎస్ 13ల పైబడిన వెర్షన్లలో ఈ గేమ్ సపోర్ట్ చేయనుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా 17 వేర్వేరు భాషల్లో ఈ గేమ్ అందుబాటులో ఉండనుందని క్రాఫ్టన్ గత నెలలో ప్రకటించింది. గతంలో మనదేశంలో ఎంతో ఫేమస్ అయిన పబ్జీ: బ్యాటిల్‌గ్రౌండ్స్‌ను రూపొందించిన పబ్జీ స్టూడియోసే ఈ గేమ్‌ను కూడా రూపొందించింది. ఈ గేమ్‌లో సరికొత్త గ్లోబల్ ఇల్యూమినేషన్ గ్రాఫిక్స్ రెండరింగ్ టెక్నాలజీని అందించారు. వుల్కాన్ ఏపీఐపై ఈ గేమ్‌ను రూపొందించారు.
ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి.. పబ్జీ మొబైల్, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ), పబ్జీ: న్యూ స్టేట్‌ల్లో డాడ్జింగ్, డ్రాప్ కాల్స్, సపోర్ట్ రిక్వెస్ట్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. పబ్జీ: న్యూ స్టేట్ ప్లేయర్స్ కోసం ఇందులో కొత్త వాహనాలు కూడా అందించారు.
అనుమతి లేని ప్రోగ్రామ్స్, ఎమ్యులేటర్స్, కీబోర్డ్, మౌస్ వంటి వాటి ఉపయోగాన్ని నిషేధిస్తూ.. హ్యాకింగ్‌ను అరికట్టే విధంగా దీన్ని రూపొందించారు. సాంకేతిక సమస్యల కారణంగా.. ఈ గేమ్ రావాల్సిన సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 2022, జనవరి 5వ తేదీన టేకియాన్ టీఆర్1 అనే వెహికిల్ స్కిన్ అందించనున్నారు.
లాంచ్ డే రివార్డ్స్ కింద న్యూ స్టేట్ ప్రొఫైల్ ఐకాన్, 10 చికెన్ మెడల్స్ లభించనున్నాయి. దీంతోపాటు కొత్త స్టేట్ టీ-షర్టులు, పాంట్లు, పారాచూట్లు వంటి వాటిని గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ద్వారా గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన ట్వీటర్ ఖాతాను కూడా కంపెనీ లాంచ్ చేసింది. లాగిన్ సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కంపెనీ దాన్ని పరిష్కరించే పనిలో పడినట్లు ఆ ఐడీ నుంచి ట్వీట్ ద్వారా ప్రకటించారు.
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!