అన్వేషించండి

Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!

Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Poco X6 Neo 5G Flipkart Sale: పోకో మనదేశంలో ఇటీవలే తన కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే పోకో ఎక్స్6 నియో 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనిపై లాంచ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పోకో ఎక్స్6 నియో 5జీలో 6.67 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.

పోకో ఎక్స్6 నియో 5జీ ధర, ఆఫర్లు (Poco X6 Neo 5G Price in India)
పోకో ఎక్స్6 నియో 5జీ రెండు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.17,999గా నిర్ణయించారు. ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్షియన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.15 వేలలోపే దీన్ని కొనేయచ్చన్న మాట.

పోకో ఎక్స్6 నియో 5జీ స్పెసిఫికేషన్లు (Poco X6 Neo 5G Specifications)
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. పోకో ఎక్స్6 నియో 5జీకి రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను చూడవచ్చు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 93.3 శాతంగానూ, పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్‌గానూ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ లభించనుంది.

6 ఎంఎం మీడియాటైక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ పోకో ఎక్స్6 నియో 5జీలో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 24 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. గేమ్స్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి గ్రాఫైట్ షీట్లు అందించారు.

పోకో ఎక్స్6 నియో 5జీ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన సెన్సార్ సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో అందించారు.

5జీ, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా పోకో ఎక్స్6 నియో 5జీలో అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏఐ బ్యాక్డ్ ఫేస్ అన్‌లాక్ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారా ఫోన్ సెక్యూర్‌గా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సింగిల్ స్పీకర్ అందించారు. పోకో ఎక్స్6 నియో 5జీ బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బరువు 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.

Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!

Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget