Nasa Space Photos: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!
Cosmic Jewelry: అంతరిక్షంలో వజ్రాల దండలా ఉన్న అద్భుతమైన ఫొటోను నాసా షేర్ చేసింది.
Cosmic Jewelry in Space: అంతరిక్షానికి సంబంధించిన మంచి ఫొటోలు, వీడియోలను నాసా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాసా అంతరిక్షానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. దానికి ‘కాస్మిక్ జ్యూవెలరీ’ అని పేరు పెట్టింది. ఇది భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోపు ద్వారా దీన్ని క్యాప్చర్ చేశారు. దీనికి ‘నెక్లెస్ నెబ్యులా’ అని పేరు పెట్టారు.
‘ఎక్కువ వయసున్న, దృఢమైన కక్ష్యలో తిరుగుతున్న సూర్యుడి వంటి నక్షత్రాల కారణంగా ఇది ఏర్పడింది. వీటిలో ఎక్కువ వయసున్న నక్షత్రాల్లో ఒకటి దాని పక్కనే ఉన్న చిన్న నక్షత్రాన్ని మింగేసింది. కానీ పెద్ద నక్షతం లోపల ఆ చిన్న నక్షత్రం తిరుగుతూనే ఉంది.’ అని నాసా తెలిపింది.
‘చిన్న నక్షత్రాన్ని తనలోకి లాగేసుకోవడం వల్ల పెద్ద నక్షత్రం సైజు పెరిగింది. దీంతో ఇందులోని పెద్ద భాగాలు కూడా అంతరిక్షంలోని బయట భాగానికి వెళ్లే వరకు రొటేషన్ రేటు కూడా పెరిగింది. శిథిలాల నుంచి తప్పించుకుంటూ ఇవి చేసే భ్రమణం నెక్లెస్ నెబ్యులాను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా దట్టమైన వాయువులతో రింగ్ చుట్టూ ప్రకాశవంతమైన "వజ్రాలు" ఏర్పడతాయి.’ అని కూడా పోస్టులో పేర్కొన్నారు.
‘చిన్న, ప్రకాశవంతమైన గ్రీన్ గ్యాస్ ప్రాంతం చుట్టూ మెరుస్తున్న కాస్మిక్ మెటీరియల్ రింగ్ ఆకారంలో చుట్టుముట్టింది. దీంతో ఇవన్నీ ఒక నెక్లెస్‌లోని వజ్రాల ఆకారంలో ఏర్పడ్డాయి. మిగతా ఫొటోలో కొన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు, డార్క్ రెడ్ గ్యాస్ ఉన్న బ్లాక్ స్పేస్ ఉంది.’ అని కూడా తెలిపింది.
ఈ పోస్టుకు ఇంటర్నెట్‌లో చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 72 వేల వరకు లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ నెక్లెస్ నెబ్యులాకు కామెంట్ సెక్షన్లో ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా ఏర్పడ్డాయి. స్టార్ ట్రెక్ ఎపిసోడ్‌లో ఒక భాగంలా ఉందని కూడా ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
View this post on Instagram
Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?