By: ABP Desam | Updated at : 28 Feb 2022 09:20 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ లాంచ్ అయింది. (Image Credits: Poco)
Poco 108MP Camera Phone: పోకో ఎక్స్4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్ అయిన మొదటి పోకో ఫోన్ ఇదే. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ ధర (Poco X4 Pro 5G Price)
ఇందులో రెండు వేరియంట్లను అందించారు. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 299 యూరోలుగా (సుమారు రూ.25,300) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349 యూరోలుగా (సుమారు రూ.29,500) ఉంది. లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ, పోకో ఎల్లో ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఒకవేళ లాంచ్ అయితే ధర రూ.20 వేల రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది.పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.
పోకో ఎక్స్4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Poco X4 Pro 5G features)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. అయితే ర్యామ్‌ను డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా 11 జీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ అంటోంది.
256 జీబీ వరకు స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో కంపెనీ అందించింది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఇందులో ఉన్నాయి. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 205 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!
Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Samsung Galaxy S22: సూపర్ లుక్‌లో శాంసంగ్ ఎస్22 ఫోన్ - కొత్త కలర్లో లాంచ్ చేసిన కంపెనీ!
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!