Poco X3 Pro: రూ.19 వేలలో మోస్ట్ పవర్‌ఫుల్ ఫోన్.. సూపర్ ప్రాసెసర్‌తో!
పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును అందించారు. ఇప్పుడు ఈ ఫోన్ రూ.18,999కే అందుబాటులో ఉంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించింది. 2021 సెప్టెంబర్‌లో లాంచ్ అయిన పోకో ఎక్స్3 స్మార్ట్ ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పోకో ఎక్స్3 ప్రో వచ్చింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
పోకో ఎక్స్3 ప్రో ధర
ఇందులో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 నుంచి రూ.20,999కు తగ్గింది. గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ రంగుల్లో పోకో ఎక్స్3 ప్రో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై కాయిన్ డీసీఎక్స్ వాలెట్‌లో రూ.151 విలువైన బిట్‌కాయిన్‌ను ఉచితంగా అందించనున్నారు. దీంతోపాటు పలు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పోకో ఎక్స్3 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై పోకో ఎక్స్3 ప్రో పనిచేయనుంది.
ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 59 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ అంటోంది.
పోకో ఎక్స్3 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్582 సెన్సార్‌ను కంపెనీ అందించింది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
హైరిజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.94 సెంటీమీటర్లు కాగా, బరువు 215 గ్రాములుగా ఉంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!