Poco X3 GT Launch: పోకో ఎక్స్ 3 జీటీ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..
పోకో తన కొత్త ఫోన్ పోకో ఎక్స్3 జీటీని (Poco X3 GT) లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియా, వియత్నాంల్లో మాత్రమే లాంచ్ అయింది. క్లౌడ్ వైట్, స్టార్గేజ్ బ్లాక్, వేవ్ బ్లూ అనే మూడు రంగుల్లో ఇది లభిస్తుంది.
పోకో ఎక్స్ 3 జీటీ (Poco X3 GT ) ఫోన్ వచ్చేసింది. మలేషియా, వియత్నాంలలో మాత్రమే ఇది లాంచ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల అయిన పోకో ఎక్స్ 3కి అప్‌డేటెడ్ వెర్షన్ ఇది. దీనిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం హోల్ పంచ్ కటౌట్ ఉండటం దీని ప్రత్యేకత. అక్ట్రాకోర్ మీడియాటెక్ ఎస్ఓసీతో ఇది రానుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ వెనక వైపు మూడు కెమెరాలు అందించారు. ఫ్రంట్ సైబ్ సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
క్లౌడ్ వైట్, స్టార్గేజ్ బ్లాక్, వేవ్ బ్లూ అనే మూడు రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదల అవుతుందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. చైనాలో ఈ ఏడాది మేలో విడుదల అయిన రెడ్ మీ నోట్ 10 ప్రో 5జీ ఫోనుకు రీబ్రాండెడ్ వేరియంట్‌గా ఈ పోకో ఎక్స్ 3 జీటీ లాంచ్ అయింది.
ధర, వేరియంట్లు..
ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 మలేషియా రింగెట్లుగా (సుమారు రూ.22,800).. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 మలేషియా రింగెట్లుగా (సుమారు రూ.28,000) ఉంది.
స్పెసిఫికేషన్ల వివరాలు..
- పోకో ఎక్స్ 3 జీటీలో 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ (1,080x2,400 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంటుంది.
- స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంటుంది. వీటితో పాటు డీసీఐ - పీ3 కలర్ గామ్యూట్ కవరేజ్ కూడా ఉంది.
- బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై (SoC) పనిచేస్తుంది. మాలి-జీ 77 జీపీయూతో జత చేయబడి ఉంది.
- 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు.
- వెనక వైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైబ్ సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
- కనెక్టివిటీ ఆప్షన్లుగా 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. లైట్ సెన్సార్, ప్రొక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్ వంటివి ఉన్నాయి.
- డాల్బీ అట్మోస్‌తో పాటు డ్యూయల్ స్పీకర్లను సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 193 గ్రాములుగా ఉంది.