Playstation 5 Sales Record: ఒక్క నిమిషంలో అవుట్ ఆఫ్ స్టాక్.. ఇది కదా మాస్ అంటే!
సోనీ ప్లేస్టేషన్ 5 చాలా నెలల తర్వాత ఈరోజు సేల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఒక్క గంటలోనే పీఎస్5 యూనిట్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి.
సోనీ తన ప్లేస్టేషన్ 5 గేమింగ్ కన్సోల్‌ను ఈరోజు(డిసెంబర్ 6వ తేదీ) రీస్టాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు అందుబాటులోకి తెచ్చిన స్టాక్ మొత్తం ఒక్క నిమిషంలోపే అయిపోవడం విశేషం. ‘పీఎస్ 5 నా అమెజాన్ కార్ట్‌లోకి యాడ్ చేసుకోగలిగాను. అయితే నేను చెకౌట్ చేసే సమయానికి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సోనీ అధికారిక వెబ్‌సైట్‌లో యాడ్ టు కార్ట్ బటన్ నొక్కగానే.. వెంటనే నోటిఫై మీ అనే బటన్ వచ్చేసింది. క్రోమా, ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్‌లో అదే సమస్య ఎదురైంది.’ అని ఒక యూజర్ తెలిపారు.
రిలయన్స్ డిజిటల్‌లో అయితే ప్రొడక్ట్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సోనీ తన పీఎస్5 యూనిట్లను ఎప్పుడు సేల్‌కు తీసుకువచ్చినా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 2022లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని అంచనా. కాబట్టి కొత్త ప్లేస్టేషన్ కొనాలనుకునేవారికి వెయిటింగ్ తప్పేలా లేదు. పీఎస్5 డిజిటల్ ఎడిషన్‌కి ఇది ఏడో ప్రీ-ఆర్డర్ ఫేజ్ కాగా, పీఎస్5కి 10వ ప్రీ-ఆర్డర్ ఫేజ్.
తర్వాతి సేల్ ఎప్పుడు జరగనుందో తెలియరాలేదు. ఇప్పుడు ఆర్డర్ చేసిన వారికి డిసెంబర్ 15వ తేదీ నుంచి డెలివరీ చేస్తామని అమెజాన్ తెలిపింది. అయితే దానికంటే ముందే ఇవి డెలివరీ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్లాట్‌ఫాంలు మాత్రం పీఎస్5 ఆర్డర్లను క్యాన్సిల్ కూడా చేసుకునే అవకాశం ఉంది.
ప్లేస్టేషన్ 5 ధర మనదేశంలో రూ.49,990గా నిర్ణయించారు. ప్లేస్టేషన్ 5 డిజిటల్ ఎడిషన్ ధర రూ.39,990గా ఉంది. డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ ధరను రూ.5,990గానూ, హెచ్‌డీ కెమెరా ధరను రూ.5,190గానూ, పల్స్ 3డీ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధరను రూ.2,590గానూ నిర్ణయించారు. డ్యూయల్ సెన్స్ చార్జింగ్ స్టేషన్ ధర రూ.2,590గా ఉంది.
అయితే కన్సోల్ కొన్న వారికి డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ కూడా బాక్స్‌లో ఉచితంగా లభిస్తుంది. ఈ సంవత్సరం జులై 18వ తేదీ నాటికి 10 మిలియన్ల పీఎస్5 కన్సోల్స్ అమ్ముడుపోయాయని సోనీ అధికారికంగా తెలిపింది.. అత్యధికంగా అమ్ముడుపోయిన గేమింగ్ కన్సోల్ ఇదేనని సోనీ ఈ సందర్భంగా తెలిపింది. 2021 చివరికి 1.8 కోట్ల పీఎస్5 యూనిట్లు అమ్ముడుపోవచ్చని సోనీ అంచనా వేస్తుంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!