Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!
వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇప్పుడు ఏ చిన్న పనైనా స్మార్ట్ ఫోన్ ద్వారానే చక్కదిద్దు కుంటున్నారు. కాసేపు ఫోన్ ఉపయోగాలు పక్కన పెడితే, దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో వానలో ఫోన్లు తడవటం మూలంగా చాలా వరకు చెడి పోతాయి. అయితే, కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్లను భద్రంగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. వర్షం కురుస్తున్న సమయంలో ఫోన్లను ఎలా రక్షించుకోవాలి? ఒకవేళ వర్షం నీటిలో తడిస్తే ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వాటర్ ప్రూఫ్ ఫోన్ కేస్‌ని ఉపయోగించండి
వానాకాలంలో స్మార్ట్ ఫోన్ కు వాటర్‌ప్రూఫ్ ఫోన్ కేస్ ఉపయోగించడం మంచిది. ఇది మీ డివైజ్ ను వర్షపు నీటి నుంచి చక్కగా రక్షిస్తుంది. ఈ కేసులు ఫోన్‌ను తేమ నుంచి కాపాడటంతో పాటు ప్రమాదవశాత్తూ కిందపడినా కొంత మేర కాపాడుతాయి. మీ మోడల్‌కు సరిపోయే మంచి నాణ్యత కలిగిన వాటర్ ఫ్రూఫ్ కేసులు వాడటం మంచిది.
జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచండి
ఒక వేళ మీరు వాటర్‌ప్రూఫ్ కేస్ వాడకపోతే జిప్‌లాక్ బ్యాగ్‌ని ఉపయోగించడం ఉత్తమం. దీని ద్వారా మీ ఫోన్‌ను వర్షపు చినుకుల నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన వాటర్ ఫ్రూప్ కేసులా రక్షణను అందించనప్పటికీ, కొంత మేర వర్షం ప్రభావం నుంచి కాపాడుతుంది.
వర్షంలో తడవకుండా ఉండేలా ప్రయత్నించండి
భారీ వర్షం సమయంలో మీ ఫోన్‌ను ఉపయోగించకుండా ఉండటం మంచిది. వర్షపు చినుకులకు గురికావడం వలన డివైజ్ సున్నితమైన భాగాలలోకి నీరు ప్రవేశించే ప్రమాదాన్ని పెంచుతుంది. వర్షం కురుస్తున్న సమయంలో మీరు మీ ఫోన్‌ను ఆరుబయట ఉపయోగించినట్లయితే, గొడుగు కింద ఉండటం లేదంటే షెల్టర్ లో ఉండటం మంచిది.
తడి చేతులతో జాగ్రత్తగా ఉండండి
మీ ఫోన్‌ని హ్యాండిల్ చేసే ముందు మీ చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడి చేతులతో పట్టుకోవడం వల్ల ఫోన్ కిందికి జారిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రమాదవశాత్తూ నీటి చుక్కలు ఫోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మీ చేతులను టవల్‌తో తుడుచుకోవడం లేదంటే ఆరేంత వరకు ఆగి ఉపయోగించడం మంచిది.
వాటర్‌ప్రూఫ్ పర్సు/ బ్యాగ్‌ని తీసుకెళ్లండి
ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాటర్‌ప్రూఫ్ పర్సు లేదంటే బ్యాగ్‌ని తీసుకెళ్లండి. ఈ పర్సులు వర్షపు నీటి నుంచి రక్షణ అందిస్తాయి. వాస్తవానికి ఇవి సీల్డ్ క్లోజర్‌లను కలిగి ఉంటాయి. మీ ఫోన్ పొడిగా ఉండేలా చూసుకుంటూ సురక్షితంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయి.
వర్షంలో మీ ఫోన్ తడిసిపోతే ఏం చేయాలి?
సురక్షిత చర్యలు పాటించపోవడం వల్ల మీ ఫోన్ వర్షంలో తడిస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ మీ స్మార్ట్ ఫోన్ ను వీలైనంత వరకు వెంటనే బయటకు తీయాలి.
⦿ అప్పటికీ స్మార్ట్ ఫోన్ ఆన్ లో ఉంటే స్విచ్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల షార్ట్-సర్క్యూట్‌ను నివారిస్తుంది.
⦿ మీ స్మార్ట్ ఫోన్ కు ఉంచిన ప్రొటెక్షన్ కేస్ లాంటివి తొలగించాలి. SIM కార్డ్, మెమరీ కార్డ్ ను తీయాలి.
⦿ మృదువైన, మెత్తటి వస్త్రం, టవల్ ఉపయోగించి, మీ డివైజ్ మీద ఉన్న నీటిని సున్నితంగా తుడవాలి. పోర్ట్ లు, బటన్‌లు, హెడ్‌ఫోన్ జాక్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
⦿ మీ స్మార్ట్ ఫోన్ ఎండబెట్టిన తర్వాత కూడా స్పందించకపోతే స్మార్ట్ ఫోన్ రిపేపర్ సెంటర్ కు తీసుకెళ్లడం ఉత్తమం.
Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial