Oppo A76: 11 జీబీ ర్యామ్‌తో ఒప్పో కొత్త ఫోన్ వచ్చేసింది - ధర రూ.16 వేలలోపే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ ఏ76ను లాంచ్ చేసింది.

Oppo A76 Launched: ఒప్పో ఏ76 స్మార్ట్ ఫోన్ మలేషియాలో సైలెంట్‌గా లాంచ్ అయింది. గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన ఒప్పో ఏ74కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఒప్పో ఏ76లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6 జీబీ ర్యామ్ ఉంది. దీన్ని మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో ఒప్పో అందించింది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఒప్పో ఏ76 ధర (Oppo A76 Price)
మలేషియాలో దీని ధరను 899 రింగెట్లుగా (సుమారు రూ.15,900) నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.దీని ధర మనదేశంలో రూ.15 వేల నుంచి రూ.17 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
ఒప్పో ఏ76 స్పెసిఫికేషన్లు (Oppo A76 Specifications)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఒప్పో ఏ76 పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ ఉంది. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా దీన్ని మరో 5 జీబీ పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 11 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్ ద్వారా లభించనుందన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

