Oppo A3x 5G: బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో - రూ.13 వేలలోపే ఒప్పో ఏ3ఎక్స్ 5జీ!
Oppo A3x 5G Smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ3ఎక్స్ 5జీ. దీన్ని రూ.14 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
Oppo A3x 5G Launched: ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3x 5G) మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ ధర (Oppo A3x 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు. స్పార్కిల్ బ్లాక్, స్టారీ పర్పుల్, స్టార్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,350 తగ్గింపు లభించనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు (Oppo A3x 5G Specifications)
ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 1000 నిట్స్‌గా ఉండటం విశేషం. స్ప్లాష్ టచ్ టెక్నాలజీని ఒప్పో ఏ3ఎక్స్ 5జీలో అందించారు. అంటే తడి వేళ్లతో కూడా ఫోన్ ఆపరేట్ చేయవచ్చన్న మాట.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.0.1 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో ఏ3ఎక్స్ 5జీ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను ఈ ఫోన్ పొందింది. ఐపీ54 రేటింగ్‌ను ఒప్పో ఏ3ఎక్స్ 5జీ సపోర్ట్ చేయనుంది.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ నానో సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 5, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. ఫోన్ పక్కభాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చు. దీని మందం 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
Get the new OPPO A3x 5G now! Just at ₹13,499 for 4GB+128GB variant!
— OPPO India (@OPPOIndia) August 1, 2024
Features:
-Military-Grade Shock Resistance
-Multiple Liquid Resistance
-120Hz Ultra Bright Display
-45W SUPERVOOC™ Flash Charge
Buy Now: https://t.co/ujAIyQc0KZ pic.twitter.com/3lKIWIXrLO
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?