OnePlus Nord 2 CE: బడ్జెట్ వన్‌ప్లస్ ఫోన్ వచ్చేది అప్పుడే.. ఫీచర్లు కూడా లీక్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ ఫోన్ నార్డ్ 2 సీఈని త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ స్మార్ట్ ఫోన్ గత కొంతకాలం నుంచి వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్ 2022 మొదట్లో లాంచ్ కానుందని అందరూ అంచనా వేశారు. అయితే తాజాగా వస్తున్న లీకుల ప్రకారం.. ఈ ఫోన్ ఫిబ్రవరి కంటే ముందు లాంచ్ కాబోదని లీకులు వస్తున్నాయి.
ఈ సంవత్సరం జూన్‌లో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈకి తర్వాతి వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ లాంచ్ కానుంది. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఈ ఫోన్ 2022 ఫిబ్రవరి తర్వాతే లాంచ్ కానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందనే విషయం మాత్రం తెలియరాలేదు.
వన్‌ప్లస్ కూడా ఈ ఫోన్ గురించి అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో త్వరలో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుంది. ఇటీవలే బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కూడా ఐవీ2201 మోడల్ నంబర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ కనిపించింది.
వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు లీకైన ఫీచర్ల ప్రకారం.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. వన్‌ప్లస్ తన ఫోన్లలో ఎస్‌డీ కార్డు స్లాట్‌ని అందించదు. కాబట్టి ఈ ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం లేదు.
వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈలో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?