Headphone jack : హెడ్‌ఫోన్ జాక్‌కి ఇలా రింగ్స్ ఎందుకు ఉంటాయి?
Headphone jack :మనం తరచూ వాడే స్పీకర్ జాక్, హెడ్ ఫోన్ ప్లగ్ పిన్స్ కి రెండు రింగులు ఉంటాయి. అవి ఏ విధంగా పని చేస్తాయో మీకు తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం
Headphone jack : టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతిల్లోకి వచ్చేసింది. ఈ రోజుల్లో హెడ్‌సెట్, స్మార్ట్ ఫోన్ వినియోగించని వారే కనిపించడం కరువైంది. మార్కెట్లో నిత్యం కొత్తకొత్త ఫోన్లు, వైర్ లెస్ హెడ్ సెట్లు(ఇయర్ పాడ్స్) వస్తున్నాయి. అయితే ఎన్ని రకాల వైర్ లెస్ ఇయర్ పాడ్స్ వచ్చినా మనకు మాత్రం హెడ్ సెట్ అంటే అదే అండి. ఇప్పుడు వైర్ లెస్ ఇయర్ పాడ్స్ ట్రెండ్ అయినా ఒకప్పుడు ‘హెడ్ సెట్’ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. హెడ్ సెట్లని ‘హెడ్ ఫోన్ ప్లగ్’ అని కూడా పిలుస్తుంటాం. హెడ్ సెట్ అంటే ఏదో వైరుతో ఉంటుంది. పెట్టుకుని వింటే పాటలు వినిపిస్తాయి అని మాత్రమే మనకు తెలుసు. కానీ, హెడ్ సెట్ ఎలా పని చేస్తుంది అనే విషయాలు చాలా తక్కువ మందికి తెలిసుంటాయి. మీరు అప్పుడప్పుడు గమనించే ఉంటారు. కొన్ని హెడ్ సెట్లు, స్పీకర్ పిన్నులకు రెండు రింగులు, మరికొన్నింటికి మూడు రింగులు కలిగి ఉంటాయి. అయితే, అవి ఎందుకు అలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హెడ్ ఫోన్లకు ఎందుకు అలా ఉంటాయి ?
హెడ్‌ఫోన్లుె స్పీకర్ పిన్నులను గమనించినట్లైతే వాటికి బ్లాక్ కోటింగ్ తో రెండు రింగులు కలిగి ఉంటాయి. హెడ్ ఫోన్ ప్లగ్, జాక్ చేసే పని వాస్తవానికి చాలా సులభంగా ఉంటుంది. ఫోన్‌కి కనెక్ట్ చేసిన హెడ్ ఫోన్ ప్లగ్ మూలం నుంచి ఆడియో సిగ్నల్‌లను కమ్యూనికేట్ చేసి వాటిని హెడ్‌ఫోన్‌లో ప్లే చేస్తుంది. ఈ విధంగా పాటలను, ఫోన్లను ప్రసారం చేయడం దీని పని. అయితే ఈ ప్రక్రియలో హెడ్ ఫోన్లకు ఉండే రింగులు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ రింగులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటి కాస్త పెద్దగా, మరొకటి కాస్త చిన్నగా ఉంటాయి. హెడ్ ఫోన్లకు ఉండే రింగులు నాన్-కండక్టివ్ మెటీరియల్ (సాధారణంగా ప్లాస్టిక్)తో తయారు చేసి ఉంటాయి. ఈ రింగ్‌లు ప్లగ్ పిన్స్ అని పిలుస్తారు. ప్రతి ప్లగ్‌కి కనీసం రెండు రింగులు ఉంటాయి. ఒక రింగ్ సిగ్నల్‌ను తీసుకువెళ్లడానికి, మరొకటి గ్రౌండ్ లెవల్‌లో ఉపయోగపడుతుంది. ఇది ఎటువంటి డిస్టబెన్స్ కలగకుండా సహాయపడుతుంది. ఈ గ్రౌండ్ రింగు వల్ల ఆడియో సిగ్నల్ సక్రమంగా అందుతుంది.
మూడు రింగుల హెడ్ ఫోన్లు..
మరికొన్ని హెడ్ ఫోన్లు లేదా స్పీకర్ పిన్స్ మూడు రింగులు కూడా కలిగి ఉంటాయి. అందులో వన్ రింగ్ మోనో ప్లేబ్యాక్‌గా పని చేస్తుంది. ఈ ప్లగ్ ఎడమ, కుడి ఇయర్‌బడ్ రెండింటికీ కనెక్ట్ అయి సౌండ్‌ను ప్రసారం చేస్తాయి. రెండు రింగులు ప్లే బ్యాక్ గా పని చేస్తాయి. ఈ ప్లగ్‌లు, మూడు పిన్‌లను కలిగి ఉండి ఒకటి ఎడమ ఛానెల్‌కు, ఒకటి కుడి ఛానల్‌కు, మరొకటి గ్రౌండ్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఆడియోలను సక్రమంగా ఎటువంటి అంతరాయం కలగకుండా చేరేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.