Train Tickets Booking On Google: గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
గూగుల్ కంపెనీ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా గూగుల్ సెర్చ్ పేజి నుంచే రైలు టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్.. వినియోగదారుల కోసం ఎంతో ఉపయోగకరమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే సెర్చ్ లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించే గూగుల్.. ట్రావెలర్స్ కోసం సరికొత్త వివరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్షణాల్లో ప్రయాణ వివరాలను తెలిపేలా లేటెస్ట్ సెర్చ్ టూల్స్ ను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే గూగుల్ సెర్చ్ పేజీలోనే రైలు టికెట్లు బుక్ చేసుకునే కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. విమాన ప్రయాణీకుల కోసం సరికొత్త ట్రావెల్ ఆప్షన్ ను పరిచయం చేసింది.
Google Search now lets you find and shop for train tickets, buses also coming
— Glenn Gabe (@glenngabe) September 20, 2022
"Google will also identify Low Prices with a tap featuring a direct link to complete your booking on the partner’s website.” https://t.co/pIeg7mdzFT pic.twitter.com/1ccODMmXut
స్వదేశంతో పాటు విదేశాల్లోని రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు!
తాజాగా తీసుకొచ్చిన గూగుల్ సెర్చ్ పేజీ ద్వారా సొంత దేశంతో పాటు విదేశాల్లోని రైలు టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని గూగుల్ వెల్లడించింది. ఈ వెసులుబాటు ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే తీసుకొచ్చినట్లు తెలిపింది. మరికొద్ది రోజుల్లోనే మిగతా దేశాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం సెర్చ్ పేజీ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం జర్మనీ, స్పెయిన్, ఇటలీ, జపాన్ దేశాల్లోమాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ సరికొత్త సెర్చ్ టూల్ సాయంతో ఈ దేశాల్లోని ప్రయాణీకులు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ దేశాలతో పాటు పరిసర దేశాల్లోని ట్రైన్ల పేర్లు, టికెట్ ధర, రైలు ప్రయాణ వేళలు సహా అన్ని వివరాలను తన సెర్చ్ పేజీలో చూపిస్తుంది. అవసరమైన ట్రైన్ టికెట్ ను అక్కడే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలి అనుకుంటున్నారో.. ఆ పేరుతో సెర్చ్ చేయాలి. వెంటనే ఆయా ప్రాంతాల మధ్య ప్రయాణించే రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో లిస్టు కనిపిస్తుంది. ఇందులో ఏ రైలు, ఏ సమయానికి, ఎక్కడికి వెళ్తుందో వివరంగా రాసి ఉంటుంది. అంతేకాదు.. టికెట్ ధర, రైలు స్పీడు లాంటి పూర్తి వివరాలు ఉంటాయి. ఆ లిస్టులోనే నచ్చిన రైలు టికెట్ ను ఎంచుకోవాలి. అక్కడే బుక్ చేసుకోవచ్చు. ఏ సమయంలో రైళ్లు ఉన్నాయి? అనే విషయాలను కూడా ఇందులో తెలుసుకోవచ్చు. దీని మూలంగా ప్రయాణికులు తమకు అనుకూలమైన ప్రయాణవేళను సెలెక్ట్ చేసుకోవచ్చు.
విమాన ప్రయాణీకుల కోసం సరికొత్త టూల్స్
రైలు ప్రయాణీకుల మాదిరిగానే విమాన ప్రయాణీకుల కోసం కూడా పలు కొత్త టూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. విమానాలు, హోటళ్ల కోసం కొత్త ఫిల్టర్లతో గూగుల్ మరిన్ని టూల్స్ తీసుకొచ్చి యూజర్లకు మెరుగైన సేవలు అందించనుంది. ఇంటర్ సిటీ ప్రయాణం కోసం అనేక జర్నీ ఆప్షన్స్ అందించేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మున్ముందు బస్సు టికెట్లు కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతోంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?