అన్వేషించండి

Nothing Phone: నథింగ్ ఫోన్ లాంచ్ త్వరలోనే - డిఫరెంట్ డిజైన్‌తో!

నథింగ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను ఏప్రిల్‌లో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Nothing Smartphone: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ (Carl Pei) తన కొత్త స్టార్టప్ ‘నథింగ్’ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. గత నెలలో కార్ల్ పెయ్ ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేశాడు. ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం... ఈ ఫోన్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.

నథింగ్ ఇయర్ బడ్స్ తరహాలోనే ఈ ఫోన్ కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. టెక్ క్రంచ్ కథనం ప్రకారం... బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ ప్రొటో టైప్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

దీన్ని స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కొందరు కీలక చిప్ డిజైనర్లకు చూపించినట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ దాదాపు ఒక సంవత్సరం పని చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్లు కూడా ఇంతవరకు లీకవ్వలేదు. ఫిబ్రవరి 16వ తేదీన పెయ్ ట్విట్టర్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేశాడు.

ఈ ట్వీట్లకు ఆండ్రాయిడ్, స్నాప్‌డ్రాగన్ రెండూ స్పందించాయి. తాను భవిష్యత్తులో లాంచ్ చేయబోయే ఉత్పత్తుల కోసం క్వాల్‌కాంతో చేతులు కలిపినట్లు నథింగ్ 2021 అక్టోబర్‌లోనే తెలిపింది. నథింగ్ స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి.

ఈ ఫోన్ 2022 ప్రారంభంలో లాంచ్ కానుందని కూడా అప్పుడే నిపుణులు అంచనా వేశారు. దీంతోపాటు కంపెనీ పవర్ బ్యాంక్‌ను రూపొందించడానికి కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. అది నథింగ్ పవర్ (1) అయ్యే అవకాశం ఉంది. అయితే నథింగ్ ఈ డివైసెస్ గురించి ఇంకా తెలపాల్సి ఉంది.

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎసెన్షియల్‌ను కూడా నథింగ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ సహకారంతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించే అవకాశం ఉంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soujit Kumar Paul (@its_soujit_official)

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Web Security: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget