News
News
వీడియోలు ఆటలు
X

Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

నథింగ్ ఇయర్ 2 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.

FOLLOW US: 
Share:

Nothing Ear 2: నథింగ్ బ్రాండ్ (Nothing) తన సెకండ్ జనరేషన్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే నథింగ్ ఇయర్ 2. 2021లో లాంచ్ అయిన నథింగ్ ఇయర్ 1కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా నథింగ్ ఇయర్ 2 మార్కెట్లో లాంచ్ అయ్యాయి. 40 డెసిబెల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో ఉంది. బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీ ఫీచర్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. కొత్త ఎల్‌హెచ్‌డీసీ 5.0 కోడెక్ కూడా ఇందులో ఉన్నాయి. ట్రాన్స్‌పరెంట్ కేసింగ్, ఐపీ54 రేటెడ్ స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు అందించారు. మార్చి 28వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.

నథింగ్ ఇయర్ 2 ధర (Nothing Ear 2 Price )
నథింగ్ ఇయర్ 2 ధరను మనదేశంలో రూ.9,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. దీని ముందు వెర్షన్ అయిన నథింగ్ ఇయర్ 1... 2021 జులైలో లాంచ్ అయింది. అప్పుడు దీని ధర రూ.5,999గా ఉంది. మొదటి వెర్షన్ కంటే రెండో వెర్షన్ ధర ఎంతో పెరిగింది. ఇవి మనదేశంలో ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

నథింగ్ ఇయర్ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Nothing Ear 2 Specifications, Features )
దీని ముందు వెర్షన్ తరహాలోనే ఇందులో కూడా ట్రాన్స్‌పరెంట్ డ్యూయల్ ఛాంబర్ డిజైన్‌ను అందించారు. 11.6 ఎంఎం కస్టమైజ్డ్ డ్రైవర్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రతి ఇయర్ పీస్‌లొనూ మూడు ఏఐ బ్యాక్డ్ మైక్రో ఫోన్లు అందించారు. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. 40 డెసిబెల్స్ వరకు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను ఇది ఎలిమినేట్ చేస్తుంది.

బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఎల్‌హెచ్‌డీసీ 5.0 కోడెక్ సపోర్ట్ కూడా ఉంది. ఏఏసీ, ఎస్‌బీసీ బ్లూటూత్ కోడెక్స్‌ను ఈ ఇయర్ బడ్స్ సపోర్ట్ చేయనున్నాయి. ఐపీ54 రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఇయర్‌పీస్‌లకు అందించారు. కేస్‌కు ఐపీ55 రేటింగ్ అందుబాటులో ఉంది.

నథింగ్ ఎక్స్ యాప్ (Nothing X) ద్వారా ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైసెస్‌కు దీన్ని పెయిర్ చేయవచ్చు. వాల్యూమ్ అడ్జస్ట్ చేయడం, ప్లేబ్యాక్ మేనేజ్ చేయడం, నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్స్‌లోకి స్విచ్ అవ్వడం వంటి ఫీచర్లు కూడా ఈ బడ్స్‌లో అందించారు. జెస్చర్స్‌ను పెయిర్డ్ యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు.

గూగుల్ ఫాస్ట్ పెయిర్ కనెక్టివిటీ ద్వారా ఆండ్రాయిడ్ కంప్యూటర్స్‌కు వీటిని చాలా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. లో ల్యాగ్ మోడ్ ద్వారా గేమింగ్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది. డెడికేటెడ్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఇందులో ఉంది.

ఒక్కో ఇయర్ పీస్‌లో 33 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని ఛార్జింగ్ కేస్ 485 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఏఎన్‌సీ ఆఫ్ చేస్తే 36 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నాయి. 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఇవి ఎనిమిది గంటల ప్లేబ్యాక్ టైంను అందిస్తాయని కంపెనీ అంటోంది.

Published at : 23 Mar 2023 07:45 PM (IST) Tags: Nothing Ear 2 Price in India Nothing Ear 2 Nothing Ear 2 Launched Nothing Ear 2 Specifications

సంబంధిత కథనాలు

Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!

Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!

Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!

Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!

Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్