News
News
X

Nokia XR20 Phone: నోకియా ఎక్స్ఆర్ 20.. నీటిలో తడిచినా ఏం కాదు..

Nokia XR20 Phone: హెచ్‌ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా... ఎక్స్ఆర్ 20 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. తడి చేతులతో ముట్టుకున్నా పనిచేసేలా దీని డిస్‌ప్లేని రూపొందించారు.

FOLLOW US: 
Share:

హెచ్‌ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా... తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. నోకియా ఎక్స్ఆర్ 20 పేరుతో ఈ ఫోన్ విడుదల అయింది. రగ్డ్ (Rugged) బిల్డ్‌ డిజైన్ తో నోకియా నుంచి రిలీజ్ అయిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ దీనికి అదనపు ప్రత్యేకతగా ఉంది. తడి చేతులతో ముట్టుకున్నా పనిచేసేలా దీని డిస్‌ప్లేని రూపొందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా ఇది పనిచేస్తుంది. ఇందులో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ ఉంటుంది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే విడుదల అయింది. భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు ఇంకా వెల్లడించలేదు. 
ధర, వేరియంట్లు..
ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499 యూరోలుగా (సుమారు రూ.43,800)గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను ఇంకా నిర్ణయించలేదు. గ్రానైట్, అల్ట్రా బ్లూ షేడ్స్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.  
స్పెసిఫికేషన్లు వివరాలు.. 

 • డ్యుయల్ సిమ్ (నానో) నోకియా ఎక్స్ఆర్ 20 ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 
 • మూడేళ్ల వరకు ఓఎస్ వెర్షన్ అప్‌‌డేట్స్‌ను.. నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌‌డేట్స్‌ను అందించనున్నట్లు నోకియా ప్రకటించింది. 
 • 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను (1,080x2,400 పిక్సెల్స్) అందించారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 
 • తడి చేతులు, గ్లౌసులతో డిస్‌ప్లేని ముట్టకున్నా కూడా పనిచేసేలా దీనిని డిజైన్ చేశారు. 
 • ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 
 • బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఉండగా.. మెయిన్ కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉంటుంది. వీటిలో స్పీడ్‌ వ్రాప్‌, యాక్షన్ క్యామ్ మోడ్స్ అందించారు. 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
 • ఈ ఫోన్ మీద 1.8 మీటర్ వాటర్ డ్రాప్స్ పడినా, గంటసేపు నీటిలో తడిచినా పాడవకుండా వాటర్ రెసిస్టెంట్ రక్షణ కల్పించినట్లు నోకియా చెబుతోంది.

 • దీనికి MIL-STD810H సర్టిఫికేషన్ కూడా ఉంది.
 • ఐపీ68 సర్టిఫికేషన్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లను ఇందులో అందించారు. 
 • దీని బ్యాటరీ కెపాసిటీ 4630 ఎంఏహెచ్‌గా ఉంది. ఇది వైర్డ్ & వైర్‌లెస్ (క్యూఐ స్టాండర్ట్) ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 18 వాట్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. 
 • ఇందులో కనెక్టివిటీ ఆప్లన్లుగా.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.
 • యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్, బారో మీటర్, గైరో స్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉంటాయి.   
 • దీని బరువు 248 గ్రాములుగా ఉంది.
Published at : 28 Jul 2021 07:46 PM (IST) Tags: Nokia XR20 5G Phone Nokia XR20 5G Nokia XR20 5G Phone Features Nokia New Phone Nokia XR with WaterProof

సంబంధిత కథనాలు

WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!

WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు, "నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌" రికార్డ్ ఇది

ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు,

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?