Nokia X100: నోకియా కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది... ధర బడ్జెట్‌లోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్100ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19 వేలలోపే ఉంది.
నోకియా ఎక్స్100 స్మార్ట్ ఫోన్ అమెరికాలో లాంచ్ అయింది. ఇందులో 5జీ ఫీచర్‌ను కూడా అందించారు. గతంలో లాంచ్ చేసిన నోకియా ఎక్స్10 తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
నోకియా ఎక్స్100 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను అమెరికాలో 252 డాలర్లుగా(సుమారు రూ.18,700) నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోకియా అధికారిక వెబ్‌సైట్లో దీని ధరను ఇంకా ప్రకటించలేదు. మిడ్‌నైట్ బ్లూ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 19వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
నోకియా ఎక్స్100 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇందులో అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 15 జీబీ గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ లభించనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే. .ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, బ్లూటూత్ వీ5.1, ఎఫ్ఎం రేడియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4470 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాకప్‌ను కంపెనీ అందించనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 217 గ్రాములుగా ఉంది.
Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !
Also Read: ENG vs NZ, Match Highlights: మొదటిసారి ఫైనల్స్‌కు న్యూజిలాండ్.. బై.. బై.. ఇంగ్లండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి