అన్వేషించండి

Netflix New Plans: తక్కువ ధరలో నెట్‌ఫ్లిక్స్ చూడాలనుకుంటున్నారా - అయితే మీకు గుడ్‌న్యూస్!

నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్ యాడ్ సపోర్టెడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానుందని ప్రకటించింది. ఇటీవల యూజర్లను ఎక్కువగా కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్ దీనికి తగ్గట్లు దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఒకవైపు ఉన్న యూజర్లను కాపాడుకుంటూనే... కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను తీసుకురానుంది. సాధారణ ప్లాన్‌ల కంటే వీటి సబ్‌స్క్రిప్షన్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అయితే ఈ తక్కువ ధర ప్లాన్స్‌లో వినియోగదారులు యాడ్స్‌ను భరించాల్సి ఉంటుంది. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌లను నెట్‌ఫ్లిక్స్ తీసుకురానుందని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని కంపెనీ సీఈవో అధికారికంగా ప్రకటించారు.

కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్ ఒక ఇంటర్వ్యూలో నెట్‌ఫ్లిక్స్ వ్యూహాల గురించి మాట్లాడారు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్ ఎందుకు తీసుకురావాలి, దానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. తాము చాలా పెద్ద వినియోగదారుల విభాగాన్ని విస్మరించామని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఖరీదు ఎక్కువగా ఉందని, అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నా ఇబ్బంది లేదనుకునే వినియోగదారులను ఇంతకాలం పట్టించుకోలేదన్నారు. అందుకే యాడ్స్ కూడా ఉన్న కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లకు యాడ్స్ తీసుకురావడం లేదని, కేవలం కొత్తగా వచ్చే తక్కువ ధర ప్లాన్‌లకు మాత్రమే యాడ్స్ ఉంటాయనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రెండు లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో కంపెనీ ఆదాయం భారీగా పడిపోవడంతో పాటు విలువ కూడా తగ్గింది. దీంతో కాస్ట్ కటింగ్ కోసం ఆరునెలల్లోనే 600 మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేందుకు ఏం చేయాలనే ఆలోచల నుంచే ఈ యాడ్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ పుట్టాయి. ఇప్పటికే కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్ సపోర్టెడ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ బాటలోనే నడవనుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhim Jain (@bee_tech_)

టాప్ హెడ్ లైన్స్

WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Tim Cook: ఆపిల్‌ సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు! కొత్త నాయకుడు ఎవరు కాబోతున్నారు? 
ఆపిల్‌ సీఈఓగా టిమ్ కుక్‌కు నేడే చివరి రోజు! కొత్త నాయకుడు ఎవరు కాబోతున్నారు? 

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SGST Growth: వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
వ్యాపారాలు జోరందుకున్నా ఎస్‌జీఎస్టీ ఎందుకు పడిపోయింది? ఏపీ ఖజానాకు అసలు షాక్ ఎక్కడ తగిలింది?
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Embed widget