అన్వేషించండి

Sony PS5 Pro: గేమింగ్ లవర్స్‌ కోసం సోనీ ప్లేస్టేషన్‌ పీఎస్ 5ప్రో - మరింత రియలిస్టిక్‌ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో

Sony PS5 Pro: రెగ్యులర్ సోనీ ప్లేస్టేషన్‌ పీఎస్ 5 నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకుంటున్నారా? లేదా గేమింగ్‌లో లేటెస్ట్ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నారా? ఆ అనుభవాన్ని సోనీ పీఎస్ 5 ప్రో అందించేందుకు సిద్ధమైంది.

Sony PS5 Pro: మీరు రెగ్యులర్ సోనీ ప్లేస్టేషన్‌ పీఎస్ 5 నుంచి అప్‌గ్రేడ్‌ అవ్వాలనుకుంటున్నారా? లేదా గేమింగ్‌లో లేటెస్ట్ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నారా? ఆ అనుభవాన్ని పీఎస్ 5 ప్రో అందించేందుకు సిద్ధమైంది. తాజాగా సోనీ దీనిని ఆవిష్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం. 

గేమర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్లేస్టేషన్‌ పీఎస్ 5 ప్రోను  సోని విడుదల చేసింది.  అనుభవజ్ఞులైన గేమర్లు లేదా కొత్తగా ఈ తరహా ఆన్‌లైనింగ్‌ గేమ్స్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నవాళ్ల  కోసం అదిరిపోయే ఫీచర్లతో దీన్ని ఆవిష్కరించింది. పీఎస్ 5 అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది రే ట్రేసింగ్‌, ఏఐ అప్‌స్కేలింగ్‌ కెపబిలిటీ ఉండేలా, పవర్‌ ఫుల్  గ్రాఫిక్స్‌ చిప్‌ను ఇందులో అమర్చారు. 

యాక్షన్-అడ్వెంచర్, రేసింగ్, ఫాంటసీ గేమ్స్‌ను  మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో అందించేందుకు సోనీ దీన్ని రూపొందించిందని టెక్ వర్గాలు అంటున్నాయి. మెరుగైన విజువల్స్, స్మూత్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోరుకునే ప్లేయర్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్‌ అని చెబుతున్నాయి. గేమ్స్ మరింత రియలిస్టిక్‌గా ఉండేలా, మరింత ఇమ్మర్సివ్‌గా అనిపించేలా పీఎస్ 5 ప్రోను రూపొందించారని పేర్కొన్నాయి.

"మేము తయారు చేసిన కన్సోల్‌లలో ఇది మోస్ట్‌ పవర్‌ ఫుల్‌. పీఎస్‌ 5తో పోలీస్తే పీఎస్ 5 ప్రో గ్రాఫిక్స్ రెండరింగ్‌లో 45 శాతం వేగంగా  పనిచేస్తుంది." అని సోనీ ప్లేస్టేషన్ సిస్టమ్ ఆర్చిటెక్ట్‌ మార్క్‌ సెర్నీ పేర్కొన్నారు.

Also Read: రూ.14 వేలలోపే 8 జీబీ ర్యామ్ ఉన్న 5జీ ఫోన్ - టెక్నో పోవా 6 నియో 5జీ వచ్చేసింది!

ఒరిజినల్‌ పీఎస్ 5తో పోలిస్తే పీఎస్ 5 ప్రోకు AMD GPU ఉంది. దీని వల్ల 28 శాతం ఫాస్టర్‌ మెమెరీతో పాటు  67 శాతం  ఎక్కువ కంపూట్ యూనిట్స్‌తో పని చేస్తుంది. అలాగే ఇందులో ఏఐ బ్యాక్‌డ్‌ అప్‌స్కేలింగ్‌ కెపబిలిటీ ఉన్న స్పెక్ట్రల్‌ సూపర్ రిసొల్యూషన్‌((PSSR)  ఉంది. అంటే ఈ సోనీ ప్లే స్టేషన్‌ పీఎస్ 5 ప్రో స్క్రీన్‌ మరింత అందంగా, స్పష్టంగా చూపించేందుకు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగిస్తుందనమాట.

సోనీలో లేటెస్ట్ వైఫై 7 టెక్నాలజినీ సపోర్ట్ చేసే ఫస్ట్ కన్సోల్ కూడా ఈ పీఎస్‌5 ప్రోనే. ఇందులో 2TB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అలాగే స్టోరేజ్ ఎక్స్‌ప్యాన్షన్‌ కోసం అడిషనల్‌గా NVMe SSD స్లాట్‌ కూడా ఉంది. ఇంకా ప్రో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్)ను సపోర్ట్ చేస్తుంది.

ఇంకా ఈ పీఎస్ 5 ప్రో కోసం పాపులర్‌ పీఎస్ 5  టైటిల్స్‌ను రీమాస్టరింగ్ చేస్తోంది. అలాన్‌ వేక్ 2, అస్సాసిన్స్‌ క్రీడ్ షాడోస్‌,  మార్వెల్ స్పైడర్-మ్యాన్ 2’, ర్యాట్‌ చెట్‌ అండ్ క్లాంక్‌ : రిప్ట్‌ అపార్ట్‌, ది లాస్ట్ ఆఫ్ యూఎస్ పార్ట్ - II(రీమాస్టర్‌డ్‌) సహా అనేక ఇందులో గేమ్స్ ఉన్నాయి.

ధర ఎంతంటే? - ఈ కన్సోల్‌ పీఎస్ 5 ప్రో నవంబర్ 7నుంచి మార్కెట్‌లోకి అందుబాటులో రానుంది. రెగ్యులర్ పీఎస్ 5 కన్నా 40 శాతం ఎక్కువగా దీని ధర ఉండొచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి. దీని ధర 699.99డాలర్లు అని అంటున్నారు. అయితే ఇండియా మార్కెట్‌లో దీని ధర ఎంతో ఇంకా నిర్ణియించలేదు.  ఈ  PS5 ప్రోలో బ్లూ రే డిస్క్‌ డ్రైవ్‌ లేదు. కేవలం పీఎస్‌ 5 తరహాలోనే స్లిమ్ వేరియంట్‌ మాత్రం అందుబాటులో ఉండనుంది.

Also Read: రూ.95కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్- జియో, వీఐ, ఎయిర్‌టెల్ అందించే బెస్ట్ ఓటీటీ ప్లాన్లు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget