ZTE Blade V40 Pro: జెడ్‌టీఈ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది - వెనకవైపు మూడు కెమెరాలు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జెడ్‌టీఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ మెక్సికోలో లాంచ్ అయింది. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 50 నిమిషాల్లోనే జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 7,499 మెక్సికన్ పెసోలుగా (సుమారు రూ.29,000) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. డార్క్ గ్రీన్, ఐరీడీసెంట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ618 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 50 నిమిషాల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ 50 శాతం చార్జింగ్ ఎక్కనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉంది. ఈ సిరీస్‌లో జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 5జీ, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 ప్రో, జెడ్‌టీఈ బ్లేడ్ వీ40 వీటా ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram