News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo Y22: వివో కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - రూ.13 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ లాంచ్ అయింది. అదే వివో వై22.

FOLLOW US: 
Share:

వివో వై22 స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. కంపెనీ బడ్జెట్ వై-సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ అయింది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిస్‌ప్లేను వివో వై22లో అందించారు. మీడియాటెక్ హీలియో జీ85 గేమింగ్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో అందించారు.

వివో వై22 ధర
దీని ధరను 23,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.12,900) నిర్ణయించారు. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. వివో ఇండోనేషియా ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మెటావర్స్ గ్రీన్, స్టార్‌లైట్ బ్లూ, సమ్మర్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో వై22 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.67 శాతంగా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 గేమింగ్ ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఫీచర్ ద్వారా దీన్ని 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

వివో కొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఎక్స్ ఫోల్డ్ ఎస్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. వివో ఎక్స్ ఫోల్డ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. రెడ్ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, స్టోరేజ్, ర్యామ్, కెమెరాలు ఎక్స్ ఫోల్డ్ తరహాలోనే ఉండనున్నాయి. సెప్టెంబర్‌లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందా, ఎప్పుడు లాంచ్ కానుంది అనే వివరాలు తెలియరాలేదు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 05 Sep 2022 11:02 PM (IST) Tags: Vivo New Phone Vivo Y22 Price Vivo Y22 Vivo Y22 Specifications Vivo Y22 Features

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!