Vivo Price Cut: రెండు ఫోన్ల ధరలు తగ్గించిన వివో - ఇప్పుడు రూ.12 వేల లోపుకే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన రెండు ఫోన్లపై ధర తగ్గింపులను అందించింది.
వివో వై16, వివో వీ02టీ స్మార్ట్ ఫోన్లపై ధరల తగ్గింపును అందించింది. ఈ రెండు ఫోన్ల ధర రూ.500 మేర తగ్గింది. ఇవి రెండూ వివో బడ్జెట్ ధరల మోడల్సే. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను ఈ రెండు ఫోన్లలోనూ అందించారు. వీటి ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కెమెరా విషయంలో మాత్రమే కాస్త మార్పులు చేశారు. వివో వై16 స్మార్ట్ ఫోన్... మోటో జీ52, రెడ్‌మీ నోట్ 10ఎస్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22లతో పోటీ పడనుంది.
వివో వై16 ధర
ఇందులో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 నుంచి రూ.10,499కు తగ్గింది. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,499 నుంచి రూ.11,999కు కంపెనీ తగ్గించింది.
వివో వై02టీ ధర
ఇందులో ఒకే ఒక్క వేరియంట్ అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వేరియంట్ ధర రూ.9,499 నుంచి రూ.8,999కు తగ్గింది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై వివో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తుంది. వివో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల్లో వీటిని తగ్గిన ధరలకే కొనుగోలు చేయవచ్చు.
వివో వై16, వై02టీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ రెండు ఫోన్లలోనూ దాదాపు ఒకే తరహా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ కెమెరాల విషయంలోనే పలు మార్పులు చేశారు. వీటిలో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ద్వారా వివో వై16, వై02టీ స్మార్ట్ ఫోన్లను ఆపరేట్ చేయవచ్చు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ రెండు ఫోన్లు పనిచేయనుంది.
వివో వై16లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఉంది. వివో వై02టీలో కేవలం ఒక్క కెమెరా మాత్రమే ఉంది. దీని సామర్థ్యం 8 మెగాపిక్సెల్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు రెండు ఫోన్లలోనూ 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial