News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Vivo X90 Series: వివో బెస్ట్ కెమెరా ఫోన్లు వచ్చేస్తున్నాయి - ఈసారి ఏకంగా భారీ కెమెరాతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఎక్స్90 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనుంది.

FOLLOW US: 
Share:

వివో ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లలో కెమెరా ఫీచర్లు అసాధారణంగా ఉంటాయి. యాపిల్, శాంసంగ్ ఫ్లాగ్ షిప్‌లతో ఈ ఫోన్లు పోటీ పడగలవు. ఇప్పుడు వివో ఎక్స్90 సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో, వివో ఎక్స్90 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి.

అయితే ఈ స్మార్ట్ ఫోన్లలో ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియరాలేదు. క్వాల్‌కాం, మీడియాటెక్ కంపెనీలకు చెందిన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లు ఇందులో ఉండనున్నాయి. వివో ఎక్స్90 లైనప్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్ ఉందని తెలుస్తుంది. వివో ఎక్స్90 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఒక అంగుళం సెన్సార్ ఉండనుందని తెలుస్తోంది.

వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫఓన్ ఎక్స్ ఫోల్డ్ ప్లస్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లు (సుమారు రూ.1,15,000) కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 యువాన్లుగా (సుమారు రూ.1,25,000) ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2కే ప్లస్‌గా ఉంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. దీంతోపాటు 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కూడా అందించారు. గేమో మోడ్ ద్వారా రిఫ్రెష్ రేట్‌ను 120 హెర్ట్జ్ నుంచి 140 హెర్ట్జ్, 240 హెర్ట్జ్‌కు పెంచుకోవచ్చు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ మందం మడిచినప్పుడు 1.49 సెంటీమీటర్లు గానూ, ఓపెన్ చేసినప్పుడు 0.74 సెంటీమీటర్లుగానూ ఉంది. బరువు దాదాపు 311 గ్రాములు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఇందులో అందించారు.

5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్ తరహాలోనే ఇందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. పైన చెప్పినట్లు ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Published at : 24 Oct 2022 11:48 PM (IST) Tags: Vivo New Phone Vivo Vivo X90 Pro Vivo X90 Series Launch Vivo X90

ఇవి కూడా చూడండి

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి

Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి

YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

Jio AirFiber Launch: అందుబాటులోకి జియో ఎయిర్ ఫైబర్, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఎందుకంత ప్రత్యేకం?

Jio AirFiber Launch: అందుబాటులోకి జియో ఎయిర్ ఫైబర్, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఎందుకంత ప్రత్యేకం?

Honor 90 5G: హానర్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ సేల్ ప్రారంభం - ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయి?

Honor 90 5G: హానర్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ సేల్ ప్రారంభం - ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయి?

టాప్ స్టోరీస్

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

ఖలిస్థాన్ వివాదం భారత్‌ని కెనడాకి దూరం చేస్తుందా? ఇన్నాళ్ల మైత్రి ఇక ముగిసినట్టేనా?

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

Vijayasai Reddy: బాబుకి మీలో ఒకరే వెన్నుపోటు పొడుస్తారేమో - విజయసాయిరెడ్డి ఎద్దేవా

AP News : పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

AP News  :  పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్