మోస్ట్ ప్రీమియం వివో ఫోన్ వచ్చేస్తుంది - కెమెరాలు మాత్రం కేక!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఎక్స్80 సిరీస్‌లో కొత్త ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అదే వివో ఎక్స్80 ప్రో ప్లస్.
వివో ఎక్స్80 సిరీస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత మనదేశంలో కూడా లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా త్వరలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి.
వివో ఎక్స్80 ప్రో ప్లస్ వివరాలు
జీఎస్ఎంఎరీనా కథనం ప్రకారం వివో ఎక్స్80 ప్రో ప్లస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రోల కంటే చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
వివో ఎక్స్80 సిరీస్‌లోనే మోస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా ఈ ఫోన్ నిలవనుంది. వివో ఎక్స్80 ప్రో ధరను రూ.79,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. వివో ఎక్స్80 ప్రో ప్లస్ సిరీస్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న శాంసంగ్ జీఎన్1 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
వివో ఎక్స్80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఎక్స్80 ప్రో డిస్‌ప్లేనే ఉండనుంది. 6.8 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. వివో ఎక్స్80 ప్రో ధర మనదేశంలో రూ.54,999 నుంచి ప్రారంభం కానుంది.
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై వివో వీ25 ప్రో పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్‌లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. ఫోన్‌తో పాటు బాక్స్‌లో అడాప్టర్ కూడా ఉండనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!