By: ABP Desam | Updated at : 22 Sep 2022 01:10 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది.
వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో సెప్టెంబర్ 26వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. అలెర్ట్ స్లైడర్ ఫోన్ ఎడమవైపు ఉండనుంది. బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
జీస్ బ్రాండెడ్ కెమెరాను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఈ ఫోన్ ఫోల్డింగ్ టెస్టులో మూడు లక్షల సార్లకు పైగా పాస్ అయినట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 5జీ కనెక్టివిటీని అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ఇటీవలే బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్ అంటుటులో కూడా కనిపించింది.
వివో ప్రత్యర్థి బ్రాండ్ షావోమీ ఇటీవలే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 యువాన్లుగా (సుమారు రూ.1,06,200) ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,18,000), 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 11,999 యువాన్లుగానూ (సుమారు రూ.1,41,600) నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ ఫోల్డ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీని ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8.02 అంగుళాల మెయిన్ ఎల్టీపీవో 2.0 ఫోల్డింగ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 2,160x1,914 పిక్సెల్స్‌గా ఉంది. అవుటర్ డిస్‌ప్లేగా 6.56 అంగుళాల ఈ5 అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందించారు. వెనకవైపు కెమెరా సెటప్‌ను సమాంతరంగా అందించారు. ఈ ఫోన్ బరువు 262 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
iPhone 15: 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ - ఎక్కడ అందుబాటులో ఉంది? ఎందులో ఆర్డర్ చేయాలి?
Tecno Phantom V Flip: దేశంలో అత్యంత చవకైన ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ లాంచ్!
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>