November Upcoming Smartphones: నవంబర్‌లో లాంచ్ కానున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు - గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్!
Smartphones Launching in November 2024: 2024 నవంబర్‌లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు భారతదేశ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. వీటిలో అసుస్ రోగ్ 9, ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్, రియల్‌మీ జీటీ 7 ప్రో కూడా ఉన్నాయి.
Smartphones Launching in November: ప్రతి నెలా ప్రపంచ మార్కెట్లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. అలాగే నవంబర్‌లో కూడా కొన్ని స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. వీటిలో కొన్ని ఫోన్లు బెస్ట్ సెల్లింగ్ ఫోన్లు అయ్యే అవకాశం ఉంది. అసుస్, ఒప్పో, రియల్‌మీ, ఐకూ, మోటో కంపెనీల ఫోన్లు నవంబర్‌లో ప్రపంచ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
అసుస్ రోగ్ 9 (Asus Rog 9)
అసుస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ నవంబర్ 19వ తేదీన మార్కెట్లో లాంచ్ కానుంది. కొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఇందులో 6.78 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 24 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ (Oppo Find X8 Series)
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో రెండు ఫోన్లు ఉండనున్నాయి. అవే ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో. ఒప్పో ఫైండ్ ఎక్స్8లో 6.59 అంగుళాలు, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోలో 6.78 అంగుళాల ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. ఈ రెండు డివైస్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై రన్ కానున్నాయి. ఇందులో హై క్వాలిటీ లెన్స్‌ను కంపెనీ అందించనుంది.
Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!
రియల్‌మీ జీటీ 7 ప్రో (Realme GT 7 Pro)
రియల్‌మీ జీటీ 7 ప్రో చైనాలో ఇప్పటికే లాంచ్ అయింది. నవంబర్ 26వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఎప్పట్నుంచో టీజ్ చేస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. దీని డిజైన్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇది ఒక పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్.
ఐకూ నియో 10 సిరీస్ (iQOO Neo 10 series)
ఐకూ నియో 10 సిరీస్‌లో ఐకూ నియో 10, ఐకూ నియో 10 ప్రో ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రో మోడల్ స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఐకూ నియో 10 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6.78 అంగుళాల 1.5కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది.
మోటో జీ05, మోటో జీ15
మోటో జీ05 (Moto G05), మోటో జీ15 (Moto G15) మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లు సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానున్నాయో ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ నెలలోనే వస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?