Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
మీ స్మార్ట్ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలా మందికి ఎదురయ్యే కామన్ సమస్య ఫోన్ ఓవర్ హీట్. ఇంతకీ ఫోన్ ఎందుకు హీట్ అవుతుంది? దానికి గల కారణాలు ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఫోన్ ఓవర్ హీట్ కావడానికి నిజానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
కంపెనీ చార్జర్‌నే ఉపయోగించండి
ఫోన్ హీటెక్కడానికి ప్రధాన కారణం చార్జర్. కంపెనీ చార్జర్ కాకుండా ఆర్డినరీ చార్జర్ వాడటం మూలంగా ఈ సమస్య తలెత్తుతుంది. డూప్లికేట్ చార్జర్లు వాడటం మూలంగా బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. ఒక్కోసారి ఓవర్ హీటై పేలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒరిజినల్ చార్జర్లు మాత్రమే వాడాలి. చార్జింగ్ కూడా డే టైంలో 80 శాతం వరకే పెట్టాలి. రాత్ర వేళలో 100 శాతం పెట్టుకోవచ్చు.
నెట్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచకండి
మొబైల్ బాగా హీట్ కావడానికి కారణం ఇంటర్నెట్. జియో సహా పలు మొబైల్ నెట్‌వర్క్‌లు హై ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటున్నాయి. దానిని తట్టుకుని ఫోన్ సీపీయూ రన్ అవడం మూలంగా హీట్ ఎక్కువగా జెనరేట్ అవుతుంది. అందుకే మీకు ఎప్పుడు అవసరమో.. అప్పుడే ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం ఉత్తమం. అవసరం లేని సమయంలో ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం మూలంగా ఫోన్ హీట్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంటర్నెట్ ఒక్కటే కాదు.. బ్లూ టూత్ వినియోగం, వైఫై వినియోగం, లొకేషన్ ఆన్ ఉన్నా.. ఫోన్ నుంచి హీట్ ఉత్పత్తి అవుతుంది. అందుకే అవసరం ఉంటేనే వీటిని ఆన్ చేయండి.
అనవసరం లేని యాప్స్ అన్ఇన్‌స్టాల్ చేయాలి
చాలా మంది ఫోన్లలో చాలా అప్లికేషన్లు ఉంటాయి. వాటిలో చాలా వరకు యూజ్ చేయనివి సైతం ఉంటాయి. సదరు అప్లికేషన్లలో చాలా పెద్ద సైజువి కూడా ఉంటాయి. అందుకే ఫోన్లలో ఉండే అవసరం లేని యాప్స్ అన్నీ అన్ ఇన్ స్టాల్ చేసుకోవడం ఉత్తమం. లేదు.. భవిష్యత్ లో వాడుకుంటామను అనుకుంటే ఫోర్స్ స్టాప్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం మూలంగా ఫోన్ మీద ఎక్కువ భారం పడదు. ఫలితగా ఫోన్ వేడెక్కదు. వీటితో పాటు జంక్ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
ఎక్కువ బ్యాటరీని తినేసే యాప్స్‌ను తక్కువ వాడండి
మీ మొబైల్ యెక్క ఏ అప్లికేషన్ ఎక్కువ బ్యాటరీని కంజ్యూమ్ చేస్తుందో చూసుకోవాలి. ఆయా అప్లికేషన్స్ ను అవసరం ఉంటేనే వాడాలి. ఆ తర్వాత వెంటనే ఆఫ్ చేయాలి. నిజానికి ప్రతి మొబైల్ లో ఎక్కువగా బ్యాటరీని తీసుకునేది డిస్ ప్లే. ఫోన్ ఎక్కువగా హీట్ అయ్యేది కూడా దీని మూలంగానే. అందకే తక్కువ బ్రైట్ నెస్ పెట్టుకోవాలి. ఆటోమేటిక్ బ్రైట్ నెస్ ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం మూలంగా హీట్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మన ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లు డిస్ ప్లే అవుతాయి. వాటిని కూడా స్క్రీన్ మీద డిస్ ప్లే కాకుండా చూసుకోవడం మూలంగా ఫోన్ వేడి కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఫోన్ మనం వాడని సమయంలో 10 సెకెన్ల లోపే డిస్ ప్లే ఆఫ్ అయ్యేలా చూసుకోవాలి. అలా చేయడం మూలంగా ఫోన్ వేడి కాకుండా చూసుకోవచ్చు.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!