రూ.30 వేలలోపు ఫోన్ కొనాలనుకుంటున్నారా - గేమింగ్, కెమెరాలో బెస్ట్ ఇవే!
ప్రస్తుతం మనదేశంలో రూ.30 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
![రూ.30 వేలలోపు ఫోన్ కొనాలనుకుంటున్నారా - గేమింగ్, కెమెరాలో బెస్ట్ ఇవే! These are The Best Gaming Camera All Rounder Smartphones Under Rs 30000 in Amazon Prime Day Sale Flipkart Big Saving Days రూ.30 వేలలోపు ఫోన్ కొనాలనుకుంటున్నారా - గేమింగ్, కెమెరాలో బెస్ట్ ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/612367d6d2077d393edcc75fbbfca4c41687246616352601_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Best Gaming and Camera centric smartphones: ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఆఫర్ సేల్స్ జరుగుతున్నాయి. మీరు ఈ సెల్‌లో మీ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ అత్యుత్తమ కెమెరా, గేమింగ్ ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. ఇది మాత్రమే కాకుండా మీరు మంచి కెమెరా, బ్యాటరీ, గేమింగ్ సపోర్ట్‌ను పొందే కొన్ని ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం. ఈ మొబైల్ ఫోన్లన్నింటి ధర దాదాపు రూ.30,000 లోపే ఉంటుంది.
గేమింగ్‌కు ఇవే బెస్ట్!
మీకు గేమింగ్ అంటే ఇష్టమైతే ఐకూ నియో 7, పోకో ఎఫ్5, రెడ్‌మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్ ఛాయిస్. ఐకూ ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌కు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది గేమింగ్ పనితీరును మరింత మెరుగ్గా చేస్తుంది.
కెమెరా విషయంలో ఏవి మంచి ఫోన్లు?
మీకు మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలంటే గూగుల్ పిక్సెల్ 6ఏ, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, రియల్‌మీ 11 ప్రో ప్లస్, వివో వీ27 మొబైల్స్ మీకు బెస్ట్ ఆప్షన్లు. రియల్ మీ 11 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G చిప్‌సెట్, వెనుక ప్యానెల్‌లో లెదర్ ఫినిఫ్ వంటి ఫీచర్లను అందించారు.
ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్లలో...
ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి చెప్పాలంటే వీటిలో మంచి గేమింగ్ సపోర్ట్, కెమెరా, స్ట్రాంగ్ బ్యాటరీ బ్యాకప్ లభిస్తాయి, ఇందులో మోటో ఎడ్జ్ 40, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్, వన్‌ప్లస్ 10ఆర్, నథింగ్ ఫోన్ (1) మొబైల్స్ ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎల్ఈడీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక మోటో ఎడ్జ్ 40 విషయానికి వస్తే... ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు అందించారు.
🚨#TheHuntForUnbelievableJoy ends in a few hours! 🚨
— Amazon India (@amazonIN) July 16, 2023
Hurry! Join the hunt now for a chance to win incredible Prime Day prizes!
Click below to play now!https://t.co/rBhhs5FlK2#AmazonIndia #AmazonSpecials #AmazonPrimeDay #DiscoverJoy pic.twitter.com/bnUIamGNvV
@nothingindias! Welcome to Bharat. This couldn't come at a better time.. we are ready to unbox Nothing Phone (2). Let's go!
— Flipkart (@Flipkart) July 13, 2023
#IndiaUnboxesNothing #NothingOnFlipkart pic.twitter.com/rPie5JgsBX
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)