అన్వేషించండి

Tecno Pova 3 India Launch: బడ్జెట్ ధరలోనే భారీ స్మార్ట్ ఫోన్ - 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే టెక్నో పోవా 3.

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఏ తేదీన లాంచ్ కానుందో తెలియరాలేదు. కానీ దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా అమెజాన్‌లో ఓపెన్ అయింది. ఈ ఫోన్ లాంచ్, ఫీచర్లను ఈ మైక్రోసైట్‌లో చూడవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను అందించారు. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే

టెక్నో పోవా 3 ధర (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. కాబట్టి ధర విషయంలో కొంచెం ఐడియా ఉంది. ఫిలిప్పీన్స్‌లో  4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 బాత్‌లుగా (సుమారు రూ.13,300) నిర్ణయించారు. హైఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,399 బాత్‌లుగా (సుమారు రూ.13,900) ఉంది. ఎకో బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, టెక్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మనదేశంలో రూ.12 వేల రేంజ్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టెక్నో పోవా 3 ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే 11 జీబీ వరకు ర్యామ్ లభించనుందన్న మాట.

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు సెకండరీ, టెర్టియరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

4జీ, వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్ కాగా... 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.94 సెంటీమీటర్లుగా ఉండనుంది.

టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Bhuvi Comeback Masterstroke: అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
అగార్కర్ నిష్క్రమణతో మారిన స‌మీక‌ర‌ణాలు.. నాలుగేళ్ల తర్వాత భువీ రీ ఎంట్రీ, ఆర్పీ సింగ్ పట్టుదలతో కివీస్ టూర్‌కు ఎంపిక
Kidney Disease : కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
కిడ్నీలు దెబ్బతింటున్నా తెలియకపోవచ్చు.. ముందుగా గుర్తించేందుకు ఈ 2 టెస్ట్‌లు చేయించుకోండి
Embed widget