Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ 25పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సైతం, ఇదే బెస్ట్ టైం
Samsung Galaxy S25 కొనడానికి మంచి అవకాశం అనిపిస్తుంది. Flipkart భారీ తగ్గింపుతో పాటు Samsung ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది.

Samsung ఫ్లాగ్‌షిప్ మొబైల్ Galaxy S25 కొనాలనుకుంటే ఇది మంచి అవకాశం. ఈ కామర్స్ దిగ్గజం Flipkartలో ఈ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. మీరు ఎక్కువ ధర కారణంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనలేకపోతున్నారా, ఇప్పుడు తక్కువ ధరకు కొనే అవకాశం ఉంది. అద్భుతమైన రూపాన్ని, పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌పై మీరు దాదాపు రూ.11,000 ఆదా చేసుకోవచ్చు. ఫోన్ ఫీచర్‌లను చూసి దాన్ని కొనాలా వద్ద పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
శాంసంగ్ Galaxy S25 ఫీచర్లు
Samsung ఈ ఏడాది ప్రారంభంలో Galaxy S25ని విడుదల చేసింది. దీని స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.2-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఇది 12GB RAM, 512GB స్టోరేజీతో లభిస్తుంది. ఈ మొబైల్ Android 16 ఆధారిత One UI 8లో రన్ అవుతుంది. అనేక AI ఫీచర్లను మీరు గమనిస్తారు. ఫోటోలు, వీడియోగ్రఫీ కోసం శాంసంగ్ Galaxy S25 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇది 4000 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది.
ప్రస్తుతం Flipkartలో ఈ డీల్
శాంసంగ్ Galaxy S25ని రూ. 80,999 ధరకు లాంచ్ చేశారు. అయితే Flipkart నుండి దీన్ని చౌకగా కొనుగోలు చేయవచ్చు. Flipkartలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను రూ. 70,999కు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే కనుక మీరు ఈ ఫోన్‌ను మరింత చౌకగా కొనవచ్చు. పాత ఫోన్‌కు బదులుగా శాంసంగ్ (Samsung) దాని ధరతో పాటు అదనంగా రూ. 11,000 తగ్గింపు ఇస్తోంది. ఇందులో HDFC బ్యాంక్ ఆఫర్ వర్తించదు.
Galaxy S25 కొనడం ఎందుకు బెస్ట్
ఈ ఫోన్ Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది వేగంతో పాటు మంచి పనితీరును మీకు అందిస్తుంది. ఇది Galaxy S24తో పోలిస్తే 15 శాతం పెద్ద వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఇది గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ మరియు 4K వీడియో షూటింగ్ సమయంలో ఫోన్‌ను కూల్‌గా ఉంచుతుంది. ఇది ఏకంగా 12GB RAMతో వస్తుంది. మీరు చేసే మల్టీ టాస్కింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సులభతరం చేస్తుంది. దీనితో పాటు, కెమెరా నాణ్యతలో కూడా ఈ మోడల్‌తో పలు ఆండ్రాయిడ్ బ్రాండ్లు పోటీ పడలేవు.





















