News
News
X

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన రెడ్‌మీ నోట్ 11 ప్రో 2023 స్మార్ట్ ఫోన్‌ను త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

FOLLOW US: 

రెడ్‌మీ నోట్ 11 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వీటికి రిఫ్రెష్డ్ వెర్షన్లను కంపెనీ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీనికి రెడ్‌మీ నోట్ 11 ప్రో 2023 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఇటీవలే యూఎస్ ఎఫ్‌సీసీ వెబ్ సైట్లో కూడా కనిపించింది.

మైస్మార్ట్‌ప్రైస్ కథనం ప్రకారం... 2209116AG మోడల్ నంబర్ ఉన్న రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ రెడ్‌మీ నోట్ 11 ప్రో 2023 అని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ఎంఐయూఐ 13 యూజర్ ఇంటర్ ఫేస్‌పై పని చేయనుందని సమాచారం. అంటే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నారన్న మాట.

ఇదే మోడల్ నంబర్ ఉన్న ఫోన్ భారతదేశానికి చెందిన ఐఎంఈఐ డేటాబేస్‌లో కూడా కనిపించింది. అంటే ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందన్న మాట. దీంతోపాటు రెడ్‌మీ నోట్ 10 ప్రోనే రీబ్రాండ్ చేసి రెడ్‌మీ నోట్ 11 ప్రో 2023గా తీసుకొస్తున్నారని కూడా సమాచారం.

రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

News Reels

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను ఈ ఫోన్ పనిచేయడానికి . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

డ్యూయల్ స్పీకర్ సెటప్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 178.8 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 07 Oct 2022 02:22 PM (IST) Tags: Redmi New Phone Redmi Note 11 Pro 2023 Launch Redmi Note 11 Pro 2023 Redmi Note 11 Pro 2023 Features

సంబంధిత కథనాలు

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

టాప్ స్టోరీస్

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR:

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Medaram Mini Jatara : వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

Green Signal To Sharmila Padayatra : షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Green Signal To Sharmila Padayatra :   షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని షరతు !

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని