Realme P3 5G Leaks: రియల్‌మీ పీ3 5జీ ఫోన్ - స్టోరోజీ, ర్యామ్, కలర్ వేరియంట్స్ - లాంచింగ్ కు ముందే స్పెసిఫికేషన్స్ లీక్
Realme P3 5G Leaks: రియల్‌మీ పీ3 5జీ బేస్ వేరియంట్, 6 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ రానుందంటూ లీక్స్ వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం ఇది కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

Realme P3 5G Leaks : రియల్‌మీ(Realme) నుంచి మరో కొత్త 5జీ ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతోంది. రియల్‌మీ పీ3 5జీ (Realme P3 5G) త్వరలో ఇండియన్ మార్కెట్ లో అందుబాటులోకి రానున్న తరుణంలో.. ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లో ప్రో(Pro), అల్ట్రా(Ultra) వేరియంట్‌లతో పాటు స్టాండర్డ్ P3 5G మోడల్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రియల్‌మే P3 ప్రో, P3 అల్ట్రా లాంచ్ టైమ్ లైన్ (Timeline), స్పెసిఫికేషన్స్ (Specifications) లను లీక్ లు సూచించాయి. ఇప్పుడు,రియల్‌మీ పీ3 5జీ ర్యామ్ (RAM), స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ (Storage Configurations), కలర్ ఆప్షన్‌ల (Colour Options)కు సంబంధించిన కొత్త వివరాలు ఆన్‌లైన్‌లో వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో రియల్‌మీ P3 5G లాంచ్: ర్యామ్, స్టోరేజ్ వివరాలు
91మొబైల్స్ నివేదిక ప్రకారం, రియల్‌మీ పీ3 5జీ మోడల్ నంబర్ RMX5070తో రానుంది. ఈ ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీని నిర్ధారించనప్పటికీ, ఇప్పటికే లీకైన స్పెసిఫికేషన్లు ఫోన్ లో ఉండవచ్చని సూచిస్తున్నాయి. బేస్ వేరియంట్, 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉండనుంది.
కలర్ వేరియంట్స్
రియల్‌మీ P3 5G రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. అవి :
- కామెట్ గ్రే
- నెబ్యులా పింక్
స్పెసిఫికేషన్స్
8 జీబీ కాన్ఫిగరేషన్స్ కోసం యూజర్స్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్ ను ఆశించవచ్చు. అవి 128 జీబీ, 256 జీబీ. అందులో టాప్ టైర్ 8GB + 256GB వెర్షన్ కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్‌లో వస్తుందని ఆశిస్తున్నారు. 8GB + 128GB మోడల్‌లో కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే, ప్రామాణిక రియల్‌మీ P3 5G గురించి అదనపు సమాచారం అందుబాటులో లేదు. అయితే, రాబోయే వారాల్లో దీని గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది.
మోడల్ నంబర్ RMX5032తో రియల్‌మీ P3 ప్రో, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. ఇది ఫిబ్రవరి మూడవ వారంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఫ్లాగ్‌షిప్ రియల్‌మీ P3 ఆల్ట్రా, మోడల్ నంబర్ RMX5030ని కలిగి ఉంటుండగా.. ఇది కూడా ప్రో తరహా స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ హై-ఎండ్ మోడల్ జనవరి చివర్లో భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

