Realme GT 6: ఏఐ టెక్నాలజీతో రియల్ మీ జీటీ 6.. ధర, ఫీచర్లు ఏంటో చూద్దామా?
Realme GT 6: ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ నుంచి వచ్చిన మొదటి ఏఐ టెక్నాలజీ ఫోన్ జీటీ 6 మన దేశంలో లాంచ్ అయ్యింది. మరి ఆ ఫోన్ ధర ఎంత? ఆఫర్లు ఏమున్నాయి? ఫీచర్లు ఏంటి? ఒక లుక్కేద్దాం.
Realme GT 6 Goes On Sale In India Check Offers And Price : మార్కెట్ లోకి రోజుకో కొత్త మొబైల్ రిలీజ్ అయిపోతుంది. ఒక కంపెనీని మించి మరో కంపెనీ పోటీ పడిమరీ తమ యూజర్లకు అప్ డేటెడ్ వర్షన్ లో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అలా ఇప్పుడు రియల్ మీ కంపెనీ నుంచి జీటీ 6 ఫోన్ రిలీజ్ అయ్యింది. ఏఐ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను అందిస్తుంది. కాగా.. ‘రియల్ మి’ నుంచి వచ్చిన మొదటి ఏఐ ఫోన్ ఇదే. మరి దీని ఫీచర్లు, ధర తదితర వివరాలపై ఓ లుక్కేయండి.
Realme GT 6 మోడల్ ఫోన్ జూన్ 25 నుంచి ఇండియన్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ 12ఆర్, షావోమీ 14 సీఐవీఐలతో పోటీ పడుతుంది ఈ ఫోన్. ఇక లేటెస్ట్ ఎడిషన్ టాప్ ఐటర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జనరేషన్ తో వస్తుంది. అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. సామ్ సంగ్ గెలాక్సి ఎస్ 4, గూగుల్ పిక్సెల్ డివైజస్ లో లాగానే ఇందులో కూడా ఏఐ ప్రీ ఇన్ స్టాల్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇండియాలో 12 జీబీ రామ్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఫోన్ స్టార్టింగ్ ధర రూ.40,999గా ఉంది. అలాగే 12 GB + 256 GB,16GB (అదనపు స్టోరేజ్) ఫీచర్స్ కలిగిన ఫొన్ ధర రూ.42,999 నుంచి రూ.44,999 వరకు ఉంది.
సేల్ ఆఫర్స్ ఏంటంటే?
ఈ ఫోన్ 8GB/256GB and 16GB/512GB వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీనిపై హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి. దాదాపు రూ.4 వేలు తగ్గింపు లభిస్తుంది. ఇక అంతే కాకుండా 12GB/256GB వేరియంట్ మీద అదనంగా రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. 12 నెలల వరకు ఈఎమ్ ఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో కొనేవాళ్లకి ప్రత్యేకమైన ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ ని మెయిన్ స్టోర్ లో కొనేవాళ్లకి ఆరు నెలల స్క్రీన్ డ్యామేజ్ ప్రొటక్షన్, రియల్ మీ బడ్స్ ఫ్రీగా అందిస్తున్నారు.
స్పెసిఫికేషన్స్, ఫీచర్స్..
Realme GT 6 ఫోన్ కి AMOLED డిస్ ప్లే, అది కూడా ఫుల్ హెడ్ డీ + రెజల్యూషన్ వస్తుంది. ట్రిపుల్ కెమెరా వస్తుంది. 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్ వై టీ - 808 ప్రైమరీ సెన్సార్ తో వస్తుంది. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఇక ఫ్రెంట్ కెమెరా విషయానికొస్తే.. 32 మెగాపిక్సెల్స్ తో సూపర్ క్వాలీటీ కెమెరాను అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వర్క్ అవుతుంది. 4ఎన్ ఎమ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జనరేషన్ తో వస్తోంది ఈ ఫోన్. రియల్ జీటీ 6 లో అడ్వాన్స్ డ్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఏఐ నైట్ విజన్ మోడ్, స్మార్ట్ రిమూవల్, ఫొటో ఎడిటింగ్, యూజర్ ఇంట్రాక్షన్ ఉన్నాయి.
Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?