అన్వేషించండి

Oppo Reno 8 Lite 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో రెనో 8 లైట్ 5జీ.

ఒప్పో రెనో 8 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ స్పెయిన్‌లో లాంచ్ అయింది. మనదేశంలో లాంచ్ అయిన ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌కి పలు మార్పులు చేసి రెనో 8 లైట్ 5జీగా మార్కెట్లోకి తీసుకువచ్చారు. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 429 యూరోలుగా (సుమారు రూ.35,700) అందించారు. బ్లాక్, రెయిన్ బో కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఒప్పో రెనో 8 లైట్ 5జీ మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

ఒప్పో రెనో 8 లైట్ 5జీ ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా... 33W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా... బరువు 173 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Comedy Drama OTT : 50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
50 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి లవ్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
10 లక్షల కంటే తక్కువ ధరకు Hyundai Bayon SUV.. బెస్ట్ సేఫ్టీ, ఫీచర్ల వివరాలు
10 లక్షల కంటే తక్కువ ధరకు Hyundai Bayon SUV.. బెస్ట్ సేఫ్టీ, ఫీచర్ల వివరాలు
Embed widget