(Source: Poll of Polls)
Oppo Find X6: సూపర్ కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్ - వన్‌ప్లస్ రేంజ్ సెన్సార్లు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తన ఫైండ్ ఎక్స్6 సిరీస్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. దీని కెమెరా వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్6 సిరీస్ లాంచ్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని కెమెరా స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ప్రకారం ఒప్పో ఫైండ్ ఎక్స్6, ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రోల్లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించనున్నారు. వన్‌ప్లస్ 11లోనూ, వీటిలోనూ ఒకేలాంటి కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను, ఒప్పో ఫైండ్ ఎక్స్6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను ఒప్పో ప్రొవైడ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన దాని ప్రకారం ఒప్పో ఫైండ్ ఎక్స్6లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉండనున్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రోలో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నారు. ఒప్పో ఫైండ్ ఎక్స్6 సిరీస్‌తో పాటు వన్‌ప్లస్ 11లో కూడా 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా అందించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఒప్పో కే10ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.17,000) ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లు (సుమారు రూ.19,300) కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా (సుమారు రూ.22,700) నిర్ణయించారు. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
ఒప్పో కే10ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో కే10ఎక్స్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. హీట్ డిస్సిపేషన్ సిస్టం కూడా ఈ ఫోన్‌లో ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?