News
News
X

మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.

FOLLOW US: 

వన్‌ప్లస్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు పీట్ లా దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనికి సంబంధించిన పేరు, ఇతర వివరాలేవీ కూడా ప్రకటించలేదు.

ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కేటగిరిలో శాంసంగ్ నంబర్ వన్‌గా ఉంది. షావోమీ కూడా ఇటీవలే మిక్స్ ఫోల్డ్ 2ని లాంచ్ చేసింది. మోటో రేజర్ 2022 కూడా చైనాలో ఎంట్రీ ఇచ్చింది. వన్‌ప్లస్ భాగస్వామ్య సంస్థ ఒప్పో కూడా ఫైండ్ ఎన్ పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

పీట్‌ లా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఫొటోకు ‘మీరు దీని గురించి ఏం అనుకుంటున్నారు?’ అని క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి ఇది ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పవచ్చు. దీని గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే త్వరలో దీనిపై ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ ఇందులో అందించనుంది.

దీని ఫీచర్లు ఒప్పో ఫైండ్ ఎన్ తరహాలోనే ఉండే అవకాశం ఉంది. ఒప్పో ఫైండ్ ఎన్‌లో బయటవైపు 5.49 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 18:9గా ఉంది. ఇక లోపల ఉన్న అన్‌ఫోల్డెడ్ డిస్‌ప్లే సైజు 7.1 అంగుళాలుగా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఎల్టీపీవో టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 8.4:9గా ఉంది.

ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. సగం బ్యాటరీ 30 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. పూర్తిగా చార్జ్ అవ్వడానికి 70 నిమిషాల సమయం పట్టనుంది. 15W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇందులో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 కెమెరాను అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా ఉండనున్నాయి. ఇక అవుటర్ స్క్రీన్ వైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇన్నర్ డిస్‌ప్లేలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండనున్నాయి.

ఆండ్రాయిడ్ ఆధారిత కస్టం సాఫ్ట్‌వేర్‌పై ఒప్పో ఫైండ్ ఎన్ పనిచేయనుంది. ఇందులో వినియోగదారుల కోసం కొన్ని గెస్చర్లు కూడా ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 15 Aug 2022 12:04 AM (IST) Tags: Oneplus OnePlus Foldable Phone OnePlus Foldable Phone Launch OnePlus Foldable Phone Details

సంబంధిత కథనాలు

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Tech News: రోజూ మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam