అన్వేషించండి

OnePlus Ace 3: లాంచ్‌కు రెడీ అవుతున్న వన్‌ప్లస్ ఏస్ 3 - అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్!

OnePlus Ace 3 Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో ఏస్ 3 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

OnePlus New Phone: వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 2కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. వన్‌ప్లస్ ఏస్ 3కి సంబంధించి ఇప్పటికే పలు లీకులు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్‌లో మెటల్ ఫ్రేమ్ డిజైన్ ఉండనుందని తెలుస్తోంది. 1.5కే కర్వ్‌డ్ డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో ఉండనుందని సమాచారం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ ర్యామ్ వరకు వన్‌ప్లస్ ఏస్ 3లో అందించనున్నారని టెక్ నిపుణులు అంటున్నారు. చైనా కాకుండా ఇతర ప్రపంచ మార్కెట్లలో వన్‌ప్లస్ 12ఆర్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

డిజిటల్ ఛాట్ స్టేషన్ అనే యూజర్ నేమ్ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ ఈ స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఈ టిప్‌స్టర్ తెలుపుతున్న దాని ప్రకారం ఇందులో 1.5కే రిజల్యూషన్ ఉన్న కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. మెటల్ మిడిల్ ఫ్రేమ్, గన్‌మెటల్ గ్రే గ్లాస్ బాడీలతో ఫోన్ బిల్డ్ చేయనున్నట్లు సమాచారం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉండనుంది.

వన్‌ప్లస్ ఏస్ 3 స్మార్ట్ ఫోన్ ఇటీవలే గీక్‌బెంచ్ అధికారిక వెబ్ సైట్లో కనిపించింది. పీజేడీ110 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ టెస్టింగ్‌కు వచ్చింది. సింగిల్ కోర్ టెస్టులో 1,597 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 5,304 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. లిస్టింగ్ ప్రకారం... ‘కలామా’ అనే కోడ్‌నేమ్‌తో ఈ ప్రాసెసర్‌ను లిస్ట్ చేశారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌కు కూడా ఇదే కోడ్‌నేమ్ ఇచ్చారు. 16 జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.

ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... వన్‌ప్లస్ ఏస్ 3లో 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న ప్రధాన కెమెరా అందించనున్నారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 

గ్లోబల్ మార్కెట్లలో వన్‌ప్లస్ 12ఆర్ పేరుతో వన్‌ప్లస్ ఏస్ 3 లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.39,999 ధరతో లాంచ్ అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.

మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. అయితే త్వరలో కంపెనీ దానిని 15 జీబీకి పరిమితం చేయబోతోంది. అంటే మీకు మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ  ఉంటుందో అంత డేటాను మాత్రమే వాట్సాప్ బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్ లెక్కలోకి తీసుకునేది కాదు. కానీ ఇక ముందు అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Embed widget