అన్వేషించండి

OnePlus 12: వన్‌ప్లస్ 12పై భారీ ఆఫర్ - ఎంత రేటు తగ్గిందంటే?

OnePlus 12 Huge Discount: వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీన్ని రూ.59,500కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

OnePlus 12 Discount Offer: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12 ప్రస్తుతం అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి దీనిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే ఈ తగ్గింపు ఏదైనా ప్రత్యేక సేల్ లేదా ఆఫర్‌లో భాగం కాదు. కాబట్టి ఈ తగ్గింపు ఎంతకాలం అందుబాటులో ఉంటుందో స్పష్టంగా చెప్పలేం. మీరు వన్‌ప్లస్ 12ని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.

వన్‌ప్లస్ 12 ధర
వన్‌ప్లస్ 12 ధర ఇంతకుముందు రూ. 64,999గా ఉండేది. కానీ ఇప్పుడు ఇది అమెజాన్‌లో రూ. 59,500కి అందుబాటులో ఉంది. అంటే దీనిపై మీరు రూ. 5,499 తగ్గింపును పొందుతున్నారు. ఇది కాకుండా మీరు దానిని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద కొనుగోలు చేస్తే దీని ధర మరింత తగ్గనుంది. ఈ తగ్గింపు ధర అమెజాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి దీన్ని గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.

Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల ప్రో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 12 పని చేయనుంది. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వన్‌ప్లస్ 12 వెనకవైపు హాజిల్‌బ్లాడ్ బ్రాండెడ్ మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలెర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్‌లో కంపెనీ అందించింది. ఏకంగా 1 టీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో చూడవచ్చు.

వన్‌ప్లస్ 12 యాప్ లాక్, హైడ్ యాప్స్ వంటి ఉపయోగకరమైన ఫీచర్‌లతో సహా, ఫోన్ గొప్ప డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లను, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని, తద్వారా ఇది చాలా కాలం పాటు సురక్షితంగా ఉంటుందని వన్‌ప్లస్ పేర్కొంది.

ఈ ఫోన్‌ 5400 ఎంఏహెచ్ బలమైన బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఈ ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి వన్‌ప్లస్ 12పై తగ్గింపు మంచి అవకాశం.

వన్‌ప్లస్ ఇటీవలే వన్‌ప్లస్ 13ని కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ భారత దేశ మార్కెట్లో కూడా త్వరలో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
Embed widget