అన్వేషించండి

Nothing Phone 1 Price Leak: నథింగ్ ఫోన్ 1 ధర, ప్రీ-బుకింగ్ వివరాలు లీక్ - సేల్ ఎప్పుడంటే!

నథింగ్ ఫోన్ 1 ధర, సేల్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది.

నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ జులై 12వ తేదీన లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్‌కు ముందు దీని ప్రీ-బుకింగ్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకుల ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2,000 చెల్లించి ఈ ఫోన్ ప్రీ-బుక్ చేసుకోవచ్చు. మల్టీపుల్ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ వివరాలు లీక్ చేశారు. ఈ వివరాల ప్రకారం మీరు చెల్లించే రూ.2,000 ఫోన్ కాస్ట్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. జులై 18వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే దీని ప్రీ-రిజర్వేషన్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

నథింగ్ ఫోన్ 1 ధర 500 యూరోల (సుమారు రూ.41,300) రేంజ్‌లో ఉండనుందని తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొదటి టీజర్ ప్రకారం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని మాత్రం అంచనా వేయవచ్చు.

నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉండనుంది. నథింగ్ ఇయర్ 1 తరహాలో పారదర్శకమైన డిజైన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ఏవి నిజమో? ఏవి పుకార్లో? తెలియాలంటే జులై 12వ తేదీ వరకు ఆగాల్సిందే. ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో వస్తే... ఈ తరహాలో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ ఇదే కానుంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by The Daily Tech (@thedailytechh)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి- సంఖ్య పెరిగే అవకాశం
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Embed widget