By: ABP Desam | Updated at : 21 Sep 2022 11:59 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
నథింగ్ ఫోన్ 1పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. దీనిపై రూ.5,000 తగ్గింపును అందించారు. అదనపు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. 'Catch Me If You Can Sale' సేల్ ద్వారా దీన్ని విక్రయిస్తున్నారు. అంటే ఇది కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనుందన్న మాట. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది.
నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్ సేల్ ధర, ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1 ప్రస్తుతం రూ.28,999కే అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొంటే అదనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. దీంతో ఈ ఫోన్ రూ.28,999కే లభించనుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.3,000 తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉండగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరా ఉంది.
డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు నథింగ్ ఫోన్ 1లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ లాంచ్ సమయంలో ప్రకటించింది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!
Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>