Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!
Motorola Edge 40 Neo Flipkart Sale: మోటొరోలా ఎడ్జ్ 40 నియో సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. రూ.20 వేల లోపు బెస్ట్ ఆప్షన్ ఇదే.
![Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే! Motorola Edge 40 Neo Sale Started in Flipkart Check Price Offers Details Motorola Edge 40 Neo: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? - అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే - సేల్ ప్రారంభం నేడే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/28/10b9d18fa9d01c0d03ad36c604ec25e91695891742978252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Motorola Edge 40 Neo Sale: మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ప్రస్తుతం రూ.20 వేలలోపు బెస్ట్ ఆప్షన్ ఇదే అని చెప్పవచ్చు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ (Motorola Edge 40 Neo) అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ మొబైల్ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ 10 ప్రో ప్లస్, ఐకూ నియో 6, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్ ఫోన్లతో మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ పోటీ పడనుంది.
మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ ధర, సేల్, ఆఫర్ల వివరాలు (Motorola Edge 40 Neo Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.25,999గా నిర్ణయించారు. బ్లాక్ బ్యూటీ, కెనీల్ బే, సూతింగ్ సీ కలర్ ఆప్షన్లలో మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీని కొనుగోలు చేయవచ్చు.
ఈరోజు (సెప్టెంబర్ 28వ తేదీ) రాత్రి ఏడు గంటలకు దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. ఈ ఫోన్‌పై రూ.3,000 వరకు ఫెస్టివల్ డిస్కౌంట్ అందించనున్నారు. అయితే ఈ ప్రారంభ ఆఫర్ ఎంత కాలం వరకు అందుబాటులో ఉండనుందో కంపెనీ తెలపలేదు. ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 అదనపు తగ్గింపు కూడా లభించనుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు రూ.3,500 నుంచి ప్రారంభం కానున్నాయి.
మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Motorola Edge 40 Neo Specifications)
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని డిస్‌ప్లేకు సంబంధించిన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్ ఈ హ్యాండ్‌సెట్‌కు లభించనుందని మోటొరోలా అధికారికంగా తెలిపింది. ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 40 నియో పని చేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీలో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. డస్ట్, స్ప్లాష్‌కు సంబంధించి రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా అందుబాటులో ఉంది.
జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, వైఫై, బ్లూటూత్ వీ5.3, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీలో అందించారు. గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, సార్ సెన్సార్లు, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా మీ ఫోన్‌కు, డేటాకు ప్రైవసీ లభించనుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించారు. మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 36 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ అందించనుందని కంపెనీ తెలిపింది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)