అన్వేషించండి

Moto G84 5G: రూ.20 వేలలోపే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ - మోటో జీ84 5జీ లాంచ్!

మోటొరోలా కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే మోటో జీ84 5జీ.

Moto G84 5G: మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. ఇందులో కేవలం ఒక్క స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో మూడు కలర్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 2022లో లాంచ్ అయిన మోటో జీ82 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

మోటో జీ84 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన సేల్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి జరగనుంది. వివా మాగెంటా, మార్ష్‌మాల్లో బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు మిడ్‌నైట్ బ్లూ 3డీ అక్రిలిక్ గ్లాస్ ఫినిష్ మోడల్ కూడా లాంచ్ అయింది.

మోటో జీ84 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1300 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఒక సంవత్సరం పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను మోటొరోలా అందించింది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఐపీ54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 5జీ, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP BJP Rajya Sabha candidate:  ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరు ప్రకటించిన బీజేపీ - ఆయనా ఊహించి ఉండరు!
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరు ప్రకటించిన బీజేపీ - ఆయనా ఊహించి ఉండరు!
Telangana Bhoodan Lands: భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
Pahalgam Terror Attack: సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP BJP Rajya Sabha candidate:  ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరు ప్రకటించిన బీజేపీ - ఆయనా ఊహించి ఉండరు!
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరు ప్రకటించిన బీజేపీ - ఆయనా ఊహించి ఉండరు!
Telangana Bhoodan Lands: భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
భూదాన్ భూముల అక్రమాల్లో సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్లు - తెలంగాణ అధికారవర్గంలో కలకలం
Pahalgam Terror Attack: సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
సైబర్ మోసగాళ్ల కక్కుర్తి - సైన్యం పేరుతో విరాళాల సేకరణ - అప్రమత్తం చేసిన కేంద్రం
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
Spain Power Outage: స్పెయిన్ మొత్తం కరెంట్ కట్ - ఫ్రాన్స్, పోర్చుగల్‌లో కూడా - ఏం జరిగిందంటే ?
స్పెయిన్ మొత్తం కరెంట్ కట్ - ఫ్రాన్స్, పోర్చుగల్‌లో కూడా - ఏం జరిగిందంటే ?
Padma Vibhushan Balakrishna : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ
Brahmaputra River: బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేస్తుందా ?  పాకిస్తాన్‌తో కలిసి భారీ కుట్ర ?
బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేస్తుందా ? పాకిస్తాన్‌తో కలిసి భారీ కుట్ర ?
Crime News: కూర బాగా చేసిందని కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యను చంపేసిన భర్త - అసలు ట్విస్ట్ మైండ్ బ్లాంక్ చేస్తుంది !
కూర బాగా చేసిందని కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యను చంపేసిన భర్త - అసలు ట్విస్ట్ మైండ్ బ్లాంక్ చేస్తుంది !
Embed widget