Moto G52 Launch: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ జీ52ని లాంచ్ చేసింది.
మోటొరోలా జీ52 స్మార్ట్ ఫోన్ యూరోప్‌లో లాంచ్ అయింది. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. దీంతోపాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్ కూడా ఇందులో ఉండనుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్, డ్యూయల్ స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. గతేడాది లాంచ్ అయిన మోటో జీ51కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.
మోటో జీ52 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను 249 యూరోలుగా (సుమారు రూ.20,600) నిర్ణయించారు. చార్‌కోల్ గ్రే, పొర్స్‌లెయిన్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది.
మోటో జీ52 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 87.7 శాతం కాగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 30W టర్బో పవర్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 37.9 గంటల ప్లేబ్యాక్ టైంను ఇది అందించనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఇందులో ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
View this post on Instagram
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?