అన్వేషించండి

Moto E32s India Launch: రూ.10 వేలలోపే మోటో కొత్త బడ్జెట్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్ ఈ32ఎస్‌ను ఇటీవలే యూరోప్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రేపు (జూన్ 2వ తేదీ) మనదేశంలో లాంచ్ కానుంది.

మోటో ఈ32ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రేపు (జూన్ 2వ తేదీ) లాంచ్ కానుంది. యూరోప్‌లో ఈ ఫోన్ ఇటీవలే లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

మోటో ఈ32ఎస్ ధర (అంచనా)
యూరోప్‌లో ఈ ఫోన్ ధర 149.99 యూరోల (సుమారు రూ.12,400) నుంచి ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే మనదేశంలో రూ.10 వేలలోపే దీని ధర ఉండే అవకాశం ఉంది. మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మోటో ఈ32ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై మోటో ఈ32ఎస్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 3 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 32 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Vijayawada SAAP Office Attack: విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
Adilabad RIMS: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada News: అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada SAAP Office Attack: విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
Adilabad RIMS: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada News: అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
Kalki 2: 'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
AP Weather Report: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
KTR: రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Embed widget