By: ABP Desam | Updated at : 23 Feb 2023 04:15 PM (IST)
లావా యువ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.
Lava Yuva 2 Pro: లావా యువ ప్రో 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లేను అందించారు. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ సేల్ ఆఫ్ లైన్‌లో ప్రారంభం అయిందని తెలుస్తోంది. అక్టోబర్ 2022లో లాంచ్ అయిన లావా యువ ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. 7 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది.
లావా యువ 2 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. అయితే అదనంగా 3 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
లావా యువ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ నాచ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో ఇన్‌బిల్డ్‌గా 4 జీబీ ర్యామ్ అందించారు. అయితే అదనంగా 3 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ను కూడా పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7 జీబీ వరకు ర్యామ్ ఉండనుందన్న మాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్, అదనపు వీజీఏ సెన్సార్ కూడా ఉండనున్నాయి. వీటితో పాటు ఫ్లాష్ కూడా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్‌లో కెమెరా అందించారు.
వైఫై, బ్లూటూత్ వీ5.1, 4జీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా అందించారు.5000 ఎంఏహెచ్ లిథియమ్ పాలీమర్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటు 10W అడాప్టర్ కూడా బాక్స్‌లో అందించనున్నారు. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.
ఇటీవలే లావా బ్లేజ్ ఎన్ఎక్స్‌టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. జులైలో లాంచ్ అయిన లావా బ్లేజ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్ ఎక్స్‌టెండెడ్ ఫీచర్ ద్వారా మరో 3 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుందన్న మాట.
ఈ ఫోన్ ధర రూ.9,299గా ఉండనుంది. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది.
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?