By: ABP Desam | Updated at : 17 Jul 2022 06:00 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.
లావా కొత్త బడ్జెట్ ఫోన్ బ్లేజ్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 3 జీబీ ర్యామ్‌ను అందించారు. అయితే ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 3 జీబీ ర్యామ్‌ను పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 6 జీబీ ర్యామ్‌ను ఈ ఫోన్‌తో పొందవచ్చన్న మాట.
లావా బ్లేజ్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధరను లావా రూ.8,699గా నిర్ణయించింది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
లావా బ్లేజ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, హోల్ పంచ్ తరహాలో డిజైన్ ఉంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. మరో 3 జీబీ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 6 జీబీ ర్యామ్ అన్నమాట.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. 4జీ వోల్టే, బ్లూటూత్ వీ5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, జీపీఆర్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌ను కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
ఆండ్రాయిడ్ 12, 50 మెగాపిక్సెల్ కెమెరాలతో మోటొరోలా కొత్త ఫోన్ - ధర ఎంతంటే?
iQoo Neo 7: ఐకూ కొత్త ఫోన్ త్వరలోనే లాంచ్ - సూపర్ కెమెరాలతో!
Moto G62 5G Flipkart Sale: మోటొరోలా కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.18 వేలలోనే 5జీ ఫోన్!
Nothing Phone 1: బ్రాండ్ లవర్స్‌కు నథింగ్ షాక్ - ఫోన్ రేట్ పెంపు - ఎంతంటే?
50 మెగాపిక్సెల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!