అన్వేషించండి

Lava AGNI 3 5G: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!

Lava New 5G Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా మనదేశంలో తన కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. రూ.20 వేలలోపు ధరలోనే మంచి ఫీచర్లను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

Lava AGNI 3 5G Launched: లావా అగ్ని 3 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్ అందించారు. ఫోన్ వెనకవైపు కూడా 1.74 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంది. స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఈ సెకండరీ డిస్‌ప్లేలో ఉపయోగించవచ్చు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం, 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

లావా అగ్ని 3 5జీ ధర (Lava AGNI 3 5G Price in India)
ఈ ఫోన్ విక్రయాల్లో లావా కొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. అయితే దీని బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్ లభించదు. ఛార్జింగ్ అడాప్టర్‌తో కావాలనుకుంటే రూ.2,000 అదనంగా చెల్లించాలి. అంటే దీని ధర రూ.22,999కు చేరనుందన్న. అలాగే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. దీంతో పాటు అడాప్టర్‌ను అందించనున్నారు. హెదర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్ 9వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు దీని సేల్ ప్రారంభం కానుంది.

లావా అగ్ని 3 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava AGNI 3 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. మూడు ఆపరేటింగ్ సిస్టం వెర్షన్ అప్‌గ్రేడ్లను అందించనున్నారు. నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా లభించనున్నాయి. ఇందులో 6.78 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ స్క్రీన్ అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు 1.74 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ స్క్రీన్ అందుబాటులో ఉండనుంది. కాల్స్ లిఫ్ట్ చేయడం, మెసేజ్‌లకు స్పందించడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి ఈ కెమెరా నుంచి చేసుకోవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్‌పై లావా అగ్ని 3 5జీ రన్ కానుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఉంది. దీంతోపాటు స్టోరేజ్ నుంచి 8 జీబీ వరకు ర్యామ్‌ని వర్చువల్ ర్యామ్‌గా ఉపయోగించవచ్చు. ఐఫోన్ తరహాలో యాక్షన్ బటన్ కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని ద్వారా ఫోన్ రింగ్, సైలెంట్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, కెమెరా వాడేటప్పుడు షట్టర్ బటన్‌గా ఉపయోగించడం వంటివి చేయవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఇందులో 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంది. మెమొరీ కార్డు స్లాట్‌ను అందించలేదు కాబట్టి స్టోరేజ్ పెంచుకోలేం. డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉన్న డ్యూయల్ స్పీకర్లను ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ కేవలం 19 నిమిషాల్లోనే ఎక్కుతుందని కంపెనీ అంటోంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 212 గ్రాములుగా ఉంది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget