News
News
X

iPhone 5G: ఐఫోన్లకు 5జీ - యాక్టివేట్ చేయడం ఎలా?

ఐఫోన్ వినియోగదారులకు పబ్లిక్ బీటా ద్వారా 5జీ అప్‌డేట్ వచ్చేసింది. మరి యాక్టివేట్ చేయడం ఎలా?

FOLLOW US: 

టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు iOS 16.2 బీటాను విడుదల చేసింది. దీంతో వారి హ్యాండ్‌సెట్‌ల్లో 5జీని ఎంజాయ్ చేయవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన iPhone 14, iPhone 13, iPhone 12 కోసం 5జీ ఎంపికను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

యాపిల్ ఈ వారం ప్రారంభంలో ఐవోఎస్ 16 5జీ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను విడుదల చేసింది. iPhone 14, iPhone 13, iPhone 12, iPhone SE (మూడవ తరం) మోడల్ స్మార్ట్ ఫోన్లు వాడే వినియోగదారులు యాపిల్ ఐవోఎస్ 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా డిసెంబర్‌లో పబ్లిక్‌గా అందుబాటులోకి వచ్చే ముందే 5జీని ఎంజాయ్ చేయవచ్చు.

Samsung, Xiaomi, Oppo, Vivo వంటి కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే 5జీ ఎయిర్‌వేవ్‌లకు సపోర్ట్‌ను ప్రకటించాయి. ఇప్పుడు దేశంలోని iPhone వినియోగదారులు (బీటా) కూడా తమ హ్యాండ్‌సెట్‌లలో 5జీని ఉపయోగించవచ్చు.

ఐఫోన్ వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్‌లలో 5Gని ఎలా యాక్టివేట్ చేయవచ్చో ఇక్కడ ఉంది
మీరు బీటాలో భాగమా, కాదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి పబ్లిక్ బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకోవాలి.

News Reels

నమోదు చేసుకున్న తర్వాత సెట్టింగ్స్> జనరల్> సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కి వెళ్లి, అప్‌డేట్ కోసం చెక్ చేయడానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.

డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసి, సాఫ్ట్‌వేర్ నవీకరణను ఇన్‌స్టాల్ చేయండి. (గమనిక: iOSలో ఏదైనా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దయచేసి ఫైల్‌లు మరియు మొత్తం డేటాను బ్యాకప్ చేయండి).

5జీని అందించే iOS తాజా వెర్షన్ అయిన iOS 16.2 బీటాకు మీ హ్యాండ్‌సెట్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి.

మీ ప్రాంతంలో 5జీ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడానికి, సెట్టింగ్స్> మొబైల్ డేటా> మొబైల్ డేటా ఆప్షన్> వాయిస్, డేటాకు వెళ్లి 5జీ నెట్‌వర్క్ (అందుబాటులో ఉంటే) ఎంచుకోండి.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by It’s All Apple (@its_all_apple)

Published at : 11 Nov 2022 04:14 PM (IST) Tags: Apple iPhone 5G Activation in iPhone iPhone 5G

సంబంధిత కథనాలు

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Vivo Y76s T1 Version: వివో బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేసింది - మిగతా బ్రాండ్ల బడ్జెట్ 5జీ మొబైల్స్‌కు పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Tecno Phantom X2: టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్ వచ్చేస్తుంది - షావోమీ, రియల్‌మీ టాప్ ఎండ్ ఫోన్లతో పోటీ!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

Samsung Galaxy S23 Ultra: కళ్లు చెదిరే డిస్‌ప్లేతో శాంసంగ్ కొత్త ఫోన్ - ఏకంగా ఐఫోన్ 14 ప్రో తరహాలో!

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?

Siddu On Tillu Square Rumours: డీజే టిల్లు తప్పేమీ లేదని చెబుతాడా? సిద్ధూ ఏం నిజాలు మాట్లాడతాడో?